Natural Remedies to Reduce Stretch Marks :ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది మహిళలు స్ట్రెచ్మార్క్స్తో ఆందోళన చెందుతుంటారు. అలాగని కేవలం డెలివరీ అయిన వాళ్లకే ఈ సమస్య ఎదురవుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి. ఒక్కోసారి వీటి వల్ల నచ్చినట్లు డ్రస్సింగ్ కూడా చేసుకోలేం. అందుకే ఎక్కువ మందిస్ట్రెచ్‌మార్క్స్‌నిమాయం చేసుకోవడానికి మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లు, లోషన్‌లను వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల సమస్య తగ్గడం ఏమో కానీ.. ఇందులో ఉండే రసాయనాల వల్ల చర్మానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకి ఇంట్లో లభించే వస్తువులతోనే పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. అవేంటంటే..
బంగాళాదుంప: స్ట్రెచ్‌మార్క్స్‌ని తగ్గించడంలో బంగాళాదుంప ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసంముందుగా ఒక పెద్ద బంగాళాదుంపని తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ఒక ముక్క తీసుకుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఒక పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల బంగాళాదుంప రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మకణాల ఉత్పత్తిని పెంచి.. స్ట్రెచ్‌మార్క్స్‌ని తగ్గించడానికి సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మాయిశ్చరైజర్:డైలీ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల బరువు పెరిగినా లేదా తగ్గినా చారలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడ్డా.. ఆ ప్రదేశంలో క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.
మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి!
కలబంద గుజ్జు, కొబ్బరి నూనె :మహిళల సౌందర్యాన్ని కాపాడటానికి ఎన్నో రకాలుగా కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. అయితే, స్ట్రెచ్‌మార్క్స్ తొలగించుకోవడానికి కూడా కలబంద ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకోసం కొద్దిగా కలబంద గుజ్జు, కొబ్బరినూనె కలిపి రోజూ పొట్టపై అప్లై చేసుకుంటే.. త్వరగా అవి మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.