Mouthwash Benefits And Risks :మనం ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. నోరు పరిశుభ్రంగా ఉంటే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. కొంత మందిని నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వేధిస్తుంటాయి. దీనివల్ల తాజా శ్వాస కోసం మౌత్‌వాష్‌తో నోరు క్లీన్ చేసుకుంటారు. మరి.. ఇలా రోజూ మౌత్‌వాష్ ఉపయోగించడం మంచిదేనా? దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మౌత్‌వాష్ వల్ల ప్రయోజనాలు :
- నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మౌత్‌వాష్‌ను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని అంటున్నారు.
- అలాగే మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల దంతాలమధ్య ఇరుక్కున్న ఆహారం మొత్తం తొలగిపోతుందని పేర్కొన్నారు.
- కొంత మంది తాజా శ్వాస రావడం కోసం మౌత్‌వాష్‌లను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది.
- ఫ్లోరైడ్ ఉండే మౌత్‌వాష్‌లను వాడటం వల్ల దంతలు ఆరోగ్యంగా ఉంటాయట.
- అలాగే చిగుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేసి, వాపు సమస్యలను తగ్గిస్తుందని నిపుణులంటున్నారు.
- మౌత్‌వాష్‌లను యూజ్ చేయడం వల్ల దంతాలపై ఉన్న మరకలు తొలగిపోతాయి. ఇంకా మెరిసేలా చేస్తాయని అంటున్నారు.
- ఇంకా మౌత్‌వాష్‌లను వాడటం వల్ల నోటిలో ఏర్పడే పుండ్లు కూడా తగ్గుతాయట.
మౌత్‌వాష్‌ల వల్ల కలిగే నష్టాలు :
ఆల్కాహాల్ ఉండే మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల నోరు పొడిబారుతుంది. 2018లో "క్లినికల్ ఎక్స్‌పీరిమెంటల్ డెంటిస్ట్రీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఆల్కాహాల్-ఆధారిత మౌత్‌వాష్ ఉపయోగించిన వారిలో లాలాజలం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డి మినాస్ గెరైస్ (Universidade Federal de Minas Gerais) విశ్వవిద్యాలయంలో పని చేసే డాక్టర్ ఫెర్నాండో డోస్ రియోస్ పాల్గొన్నారు. ఆల్కహాల్ ఉన్న మౌత్‌వాష్‌లు ఉపయోగించిన వారిలో లాలాజలం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.
- ఇంకా మౌత్‌వాష్‌లలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ నోటి పుండ్లకు దారితీస్తాయట.
- అలాగే ఎక్కువ రోజులు కొన్ని రకాల మౌత్‌వాష్‌లను వాడటంవల్ల దంతాలు రంగు మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- కాబట్టి.. రోజుకు రెండు సార్లు మాత్రమే ఒక నిమిషం పాటు మౌత్‌వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- మౌత్‌వాష్‌ను మింగవద్దని సూచిస్తున్నారు.
- ఇంకా మౌత్‌వాష్‌ను డాక్టర్ల సలహా ప్రకారం మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు.