తెలంగాణ

telangana

ETV Bharat / health

మామిడి తాండ్ర తింటున్నారా? - మీకు ఈ ప్రయోజనాలు లభించడం గ్యారెంటీ! - Mango Jelly Health Benefits - MANGO JELLY HEALTH BENEFITS

Mango Jelly Health Benefits : వేసవి సీజన్​లో విరివిగా దొరికే మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మిగతా రోజుల్లో అవి తిందామంటే తక్కువగా దొరుకుతుంటాయి. అలాంటి టైమ్​లో ఏడాదంతా దొరికే మామిడి తాండ్రను తినమని నిపుణులు అంటున్నారు. ఇది మామిడి రుచికి ఏమాత్రం తీసిపోదని.. అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Health Benefits Of Mango Jelly
Mango Jelly Health Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 4:58 PM IST

Health Benefits Of Mango Jelly :ఎండలు కాస్త తగ్గి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే వేసవిలో విరివిగా దొరికిన మామిడ పండ్ల ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుంటుంది. దాంతో అప్పటివరకు మామిడి పండ్ల రుచిని చూసిన వారికి మళ్లీ వాటిని తినాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం ఏడాదంతా మామిడి రుచిని ఆస్వాదించేందుకు మార్కెట్​లో మామిడి తాండ్ర అందుబాటులో ఉంటంది. దీనిని మామిడి పండ్ల గుజ్జుతో తయారుచేస్తారు. దీనిలోనూ మామిడి పండ్ల(Mango) మాదిరిగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా మామిడి తాండ్రను క్రమతప్పకుండా తినడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, మ్యాంగో జెల్లీ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పోషకాలు పుష్కలం :మామిడి తాండ్రలో యాంటీ ఆక్సిండెంట్లు, ఫైబర్, విటమిన్ ఏ, విటమన్ బి6, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి దీనిని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది :మామిడి తాండ్ర తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అలాగని మోతాదుకు మించి తింటే అనర్థాలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

రక్తప్రసరణ మెరుగుపడుతుంది :మీరు మామిడి తాండ్ర తినడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. తాండ్ర బాడీలో మంచి కొలెస్ట్రాల్​ను పెంచడంలో తోడ్పడుతుందంటున్నారు.

పచ్చి మామిడి Vs పండిన మామిడి - ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

జీర్ణ ఆరోగ్యానికి మేలు : జీర్ణసమస్యలతో బాధపడేవారు మామిడి తాండ్రను తినడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అంతేకాదు.. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.

2021లో 'Nutrition and Metabolism' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మామిడి తాండ్రను క్రమం తప్పకుండా తినే వ్యక్తులలో మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్​లోని న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం రీసెర్చ్ సెంటర్​కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు. మామిడి తాండ్ర మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మెదడుకి మేలు చేస్తుంది : మామిడి తాండ్రలో మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఫలితంగా దీనిని తినడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

ఎముకలు స్ట్రాంగ్​గా మారతాయి :మీరు ఎముకల సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే మామిడి తాండ్ర దివ్య ఔషధంలా పనిచేస్తుందట. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా దీనిని తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్​గా తయారవుతాయని సూచిస్తున్నారు.

ఇవేకాకుండా.. చర్మ సంరక్షణను పెంపొందించడంలో మామిడి తాండ్ర చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అలాగే ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. కానీ, ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే.. మామిడి తాండ్రను తీసుకునేటప్పుడు రసాయనాలు లేని సహాజమైనది ఎంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే!

ABOUT THE AUTHOR

...view details