Easy Ways to Prevent Leg Cramps at Night:కొందరు ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చున్నా, పడుకున్నా.. తరచుగా కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూటకాళ్లలో తిమ్మిర్లు(Leg Cramps) వేధిస్తుంటాయి. రాత్రిళ్లు వచ్చే ఈ సమస్య నిద్రతో పాటు జీవన నాణ్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనిని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాళ్లలో తిమ్మిర్లు రావడానికి కారణాలివే!:రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేముల శ్రీకాంత్. వాటిలో కొన్నింటిని చూస్తే..
డీహైడ్రేషన్ : బాడీ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే తగినంత వాటర్ తాగడం చాలా అవసరం. కానీ, అదే మీరు సరైన మోతాదులో నీరు తాగకపోతే డీహైడ్రేషన్ తలెత్తి కాళ్లలో తిమిర్లకు కారణమవుతుందంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.
కండరాల అలసట : కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు లేదా అతిగా శ్రమించినప్పుడు కండరాలు ఒత్తిడికి లోనై అలసట ఏర్పడుతుంది. ఇదీ రాత్రిపూట కాళ్లలో తిమిర్లు ఏర్పడేందుకు కారణం కావొచ్చంటున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం :ఈరోజుల్లో ఎక్కువ మంది ఆఫీసులలో వర్క్ చేస్తుంటారు. దాంతో ఎక్కువసేపు డెస్క్‌లో ఒకే చోట కూర్చొని పనిచేస్తుంటారు. అయితే, ఇలా అధిక సమయం ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల లెగ్ మజిల్స్‌లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా రక్తప్రసరణ తగ్గి కాళ్లలో క్రాంప్స్ రావడానికి దారితీస్తుదంటున్నారు.
వృద్ధాప్యం :వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. మరీ ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనీసం 37 శాతం మందికి రాత్రిపూట తిమ్మిర్లు వస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, మీరూ రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఆ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్.
ఇలా చేశారంటే కాళ్లలో తిమ్మిర్లు ఇట్టే మాయం!
నైట్ టైమ్ వచ్చే కాళ్ల తిమ్మిర్ల నుంచి రిలీఫ్ పొందాలంటే మరింత విశ్రాంతి తీసుకోవాలట. అలాగే.. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కండరాలను సాగదీయడం, తిమ్మిరి ఎక్కిన ప్రాంతంలో చేతితో స్మూత్‌గా మర్దన చేయడం, ఫోర్ రోలర్ సహాయంతో కాళ్లను నెమ్మదిగా మసాజ్ చేయడం వంటివి చేయాలంటున్నారు.