Korean Skin Care Tips :బ్యూటీ టిప్స్ కోసం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా మొదట కొరియన్ స్కిన్ కేర్ రొటీన్‌కు సంబంధించిన పోస్టులే దర్శనిమిస్తున్నాయి. మామూలుగా కొరియన్ అనే మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది అందం. ఇక్కడి ఆడవారు సహజంగానే ఆకర్షణీయమైన, మెరిసే చర్మాన్ని కలిగి ఉంటారు. ఇంతకీ కొరియన్ యువతులు, మహిళలు ఎందుకంత అందంగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. దీనికి గల కారణాలు ఏంటి? స్కిన్ కేర్ కోసం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు నాలుగు సార్లు
కొరియన్ బ్యూటీస్ మొదటి సీక్రెట్ ఏంటంటే- ముఖ్యంగా వారు కాలుష్యానికి దూరంగా ఉంటారు. వారి చర్మం మీద దుమ్ము, ధూళి లాంటి వాటిని అస్సలు చేరనివ్వరు. వీటి వల్ల చర్మం రంగు మారడం, మచ్చలు రావడం లాంటివి జరుగుతాయి గనుక రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటారు. ఇందుకు వారు హానికరమైన రసాయనాలు లేని సున్నితమైన సబ్బు, క్రీములను మాత్రమే ఉపయోగిస్తారు.
ఎక్స్‌ఫోలియేట్ చేయాలి
ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం రంధ్రాల్లోని మృత కణాలతో పాటు దుమ్ము, ధూళి లాంటివి బయటకొస్తాయి. ఇది మీకు సహజమైన కాంతిని, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. కనీసం వారానికి రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
టోనర్
మీరు ముఖం కడుక్కున్న లేదా స్నానం చేసిన ప్రతిసారీ టోనర్‌ను రాసుకోవాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోతుల్లోంచి మృదువుగా మారుస్తుంది. ఇది ఆరిన తర్వాత మీరు వాడే ఏ ఫేస్ క్రీమునైనా అప్లై చేసుకోవచ్చు.
సీరం
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ వెతికినా సీరం దొరుకుతుంది. అలాగని ఏది పడితే అది వాడకూడదు. మీ చర్మ తీరు ఏంటి, ఎలాంటి సీరం మీకు సూట్ అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుని తగిన సీరంలను మాత్రమే ఉపయోగించాలి.