ICMR Suggests Health Tips : కొంతమంది ఎంతసేపు పని చేసినా హుషారుగా, ముఖంపై చిరునవ్వుతో చలాకీగా కనిపిస్తుంటారు. మీ ఎనర్జీకి కారణమేంటంటే సరైన టైమ్‌లో ఆహారం తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడమేనని ఆన్సర్ ఇస్తుంటారు. అయితే, అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత వైద్య పరిశోధన మండలి (ICMR), జాతీయ పౌష్టికాహార సంస్థ (NIN) 25 ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ ఇటీవల ఓ చార్ట్‌ను విడుదల చేసింది. ఈ టిప్స్‌ని పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ హెల్త్ టిప్స్ ఏంటో మీరు చూసేయండి.
- మనం తినే ఆహారంలో అన్ని పోషకాలూ లభించవు. కాబట్టి, వైవిధ్యమైన డైట్ పాటించండి. చక్కటి పోషకాలుండే డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి.
- ప్రతిరోజు కనీసం 2 లీటర్ల నీటిని తాగడం మర్చిపోవద్దు.
- సీజనల్ పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను ఎంచుకోండి.
- కెఫిన్ ఉండే డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. బాడీకి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూడండి.
- తక్కువ కొవ్వు, అధిక ప్రొటీన్‌లతో కూడిన లీన్ మీట్‌ను వినియోగించండి.
- ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. మీ ఆహారాన్ని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలతో టేస్టీగా తయారు చేసుకోండి.
- పంచదార వినియోగం తగ్గించండి. మీ హెల్త్‌ని కాపాడుకోండి.
- అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు తినడం తగ్గించండి.
- వివిధ రకాల ఆయిల్స్‌ను మితంగా వాడటం అలవాటు చేసుకోండి.
- ఫ్రూట్ జ్యూస్‌లకు బదులు తాజా పండ్లను తినడం మంచిది.
- మార్కెట్లో కొనేముందు ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లను సరిగా చదవండి. వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోండి.
- పాలిష్ చేసిన ధాన్యాలకు బదులు ముడిధాన్యాలే హెల్త్‌కి మంచివి.
- ఇంట్లో తయారు చేసిన ఆహారానికి తినడానికి ప్రయత్నించండి. బయట ఆహారం తినడం వీలైనంత తగ్గించండి.
- ఇల్లు, ఆఫీసుల్లో మెట్లు ఎక్కి వెళ్లేందుకు ట్రై చేయండి.
- ఏ ఫుడ్ అయినా ఎమోషనల్‌గా తినొద్దు. టేస్ట్‌ని ఆస్వాదిస్తూ తినండి.
- ప్రతిరోజు మూడు పూటలా భోజన సమయం ఒకే విధంగా ఉండేలా చూసుకోండి.
- మానసిక ప్రశాంతత కోసం డైలీ ధ్యానం చేయండి.
- ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చొకుండా, మధ్య మధ్యలో బ్రేక్‌లు తీసుకోండి.
- ప్రతిరోజు వ్యాయామం చేయండి. తద్వారా మీరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటారు.
- ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు స్వీట్స్ కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి.
- స్క్రీన్ టైంను వీలైనంత తగ్గించండి. మీకోసం మీరు సమయాన్ని పెంచుకోండి.
- వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. మీ పరిసరాలు క్లీన్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
- ఉదయం కాసేపు ఎండలో ఉండండి. దీంతో మీకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
- ముడి ఆహారపదార్థాలు, వండిన ఫుడ్‌ని వేర్వేరుగా ఉంచండి. తద్వారా ఆహార కల్తీని నివారించవచ్చు.
- మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని ప్రయత్నించండి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.