How To Identify Adulterated Cooking Oil :మనం వంట చేయాలంటే తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో నూనె ఒకటి. ఇది క్వాలిటీగా ఉంటేనే ఆహారం రుచికరంగా, హెల్దీగా ఉంటుంది. కానీ.. ప్రస్తుత కాలంలో కల్తీ రాజ్యమేలుతోంది. ఈ కల్తీ ఆయిల్ తినడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు చుట్టు ముడతాయి. కానీ.. తినే ఆయిల్ మంచిదా? కల్తీ అయ్యిందా? అన్నది గుర్తించడం చాలా మందికి సాధ్యం కాదు. అందుకే.. ఇంట్లోనే కొన్ని టెస్టులు చేసి తెలుసుకోవచ్చని FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) చెబుతోంది. మరి.. ఆ పరీక్షలేంటో ఇప్పుడు చూద్దాం.
సీల్‌ను గమనించండి :
మార్కెట్‌లోనూనె కొనుగోలు చేసేటప్పుడు బాటిల్ మూత సరిగ్గా సీల్ వేసి ఉందో లేదో ఒకసారి పరిశీలించండి. సీల్ వదులుగా క్యాప్ తీసి ఉంటే.. దానిలో కల్తీ నూనె కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు విడిగా ఉండే నూనె కొనకండి. మంచి బ్రాండెడ్ కంపెనీ నూనెను కొనుగోలు చేయండి.
రంగును పరిశీలించండి :
మంచి నూనెలు నిర్దిష్టమైన రంగు, స్పష్టతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు.. ఆలివ్ నూనె "ఆకుపచ్చ బంగారు" రంగులో ఉంటుంది. పొద్దుతిరుగుడు నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. ఇలా కాకుండా ఆయిల్ రంగు వేరేలా ఉంటే కల్తీ చేశారని గుర్తించాలి.
వాసన బాగుంటుంది :
కల్తీ చేయని నూనె మంచి వాసన వస్తుంది. ఉదాహరణకు, ఆలివ్ నూనె తాజా పండ్ల వాసన వస్తుంది. ఒక వేళ నూనె దుర్వాసన వస్తుంటే.. అది కచ్చితంగా కల్తీ చేశారని గుర్తించాలి.
ఫ్రిజ్‌లో పెట్టండి :
మీరు ఉపయోగించే ఆయిల్ స్వచ్ఛమైనదా లేదా అనేది తెలుసుకోవడానికి.. కొద్దిగా నూనెను ఒక క్లియర్ కంటైనర్‌లోకి తీసుకోండి. తర్వాత దానిని ఫ్రిజ్‌లో పెట్టండి. మీరు వాడే నూనె స్వచ్ఛమైనది అయితే అది గడ్డకడతుంది. ఆ నూనె కల్తీదైతే ద్రవంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.