తెలంగాణ

telangana

ETV Bharat / health

ఉల్లిపాయలు త్వరగా పాడైపోతున్నాయా? - ఇలా చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి!

How To Buy Good Onions : వంట ఏదైనా సరే.. తాళింపుకోసం తప్పకుండా ఉల్లిపాయలు కావాల్సిందే! అంటే.. 365 రోజులూ కిచెన్​లో దీని అవసరం ఉంటుంది. అందుకే.. చాలా మంది ఎక్కువ మొత్తంలో కొని నిల్వ చేస్తుంటారు. కానీ.. అవి త్వరగా పాడై పోతుంటాయి. మరి.. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏం చేయాలో తెలుసా?

How To Buy Good Onions
How To Buy Good Onions

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 11:16 AM IST

How To Buy Good Onions : వంటింట్లో కూరగాయలు ఉన్నా.. లేకున్నా.. ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. కర్రీ చేయడానికి ఏమీ లేని సమయంలో కూడా.. ఉల్లిపాయ, గుడ్డుతో అద్భుతమైన కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇలా.. ప్రతి వంటకంలో తప్పక ఉండాల్సి వాటిలో ఉల్లిపాయలు ఒకటి. అంతేకాదు.. ఉల్లిపాయలు వేస్తే ఆ వంటకానికి మరింత టేస్ట్‌ వస్తుంది.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉల్లిపాయల ధరలు.. మార్కెట్లో పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అందుకే.. ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేసి.. ఇంట్లో నిల్వ చేస్తుంటారు జనం. కానీ.. కొన్ని రోజులకే చాలా ఉల్లిపాయలు పాడైపోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. మార్కెట్లో ఉల్లి గడ్డలు కొనేటప్పుడే అవి మంచివో కాదో తెలుసుకుని కొనాలి. మరి.. వాటిని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

మంచి ఉల్లి పాయలు కొనుగోలు చేయడానికి కొన్ని చిట్కాలు..

  • మార్కెట్లో ఉల్లి పాయలు కొనడానికి వెళ్లినప్పుడు అవి రంగు మారినట్లుగా కనిపిస్తే వాటిని కొనకండి. ఎందుకంటే అవి పాడైపోయినవి కావొచ్చు.
  • అలాగే ఉల్లి పాయలను కొనుగోలు చేసేటప్పుడు వాటిని కొద్దిగా చేతితో రెండువైపులా చివర్లో ప్రెస్‌ చేయండి.
  • ఉల్లిపాయలను నొక్కినప్పుడు కాస్త మెత్తగా చేతికి తగిలితే.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి. ఎందుకంటే అవి కచ్చితంగా పాడైపోయినవి కావచ్చు.
  • ఉల్లిపాయలపై మచ్చలు, పగుళ్లు ఉంటే వాటిని కొనకండి. అవి మార్కెట్లోకి వచ్చి చాలాకాలమైందని అర్థం. మీరు కొన్న తర్వాత అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండకపోవచ్చు.
  • అలాగే ఉల్లిపాయలు కొన్ని సార్లు దెబ్బతిని ఉంటాయి. వీటిని కొనకుండా ఉండటమే ఉత్తమం.
  • ఉల్లిపాయలు కొనేటప్పుడు అవి గుండ్రంగా ఉండేలా చూసుకోండి. సరైన ఆకారం లేకపోతే వాటిని కొనకండి.
  • ఉల్లిపాయలను కొనేటప్పుడు ఒకటి రెండింటిని చేతిలోకి తీసుకోండి. అవి బరువుగా ఉంటేనే మంచివని గుర్తుంచుకోండి. లైట్‌ వెయిట్‌ ఉన్నాయంటే అవి పాడైపోయినవి కావచ్చు.
  • ఉల్లిపాయలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని కవర్‌లలో పెట్టకూడదు. కొంచెం గాలికి ఉండేలా ఇంట్లో నేలపై కవర్‌ వేసి పెట్టండి.
  • మీరు మీ అవసరాల దృష్ట్యా రెండు వారాలకు సరిపోయే ఉల్లిపాయలను కొనుగోలు చేయండి.
  • అలాగే బాగా ఎండిన ఉల్లిపాయలను కొనుగోలు చేయండి. తడిగా ఉన్నవి తొందరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఉల్లిపాయలతో ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీరాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.
  • ఉల్లిపాయలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే జలుబు, ఫ్లూ, వంటి ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మీకు హై బీపీ ఉందా? - ఈ ఆహారం అస్సలు తీసుకోకండి!

చంకలో ఎర్రటి దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? - అయితే కారణాలు ఇవే!

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా? - ఈ వర్కౌట్ ట్రై చేశారంటే రిజల్ట్ పక్కా!

ABOUT THE AUTHOR

...view details