How Much Time We Spend in Toilet:మీరు టాయిలెట్‌కు ఎంత సమయం వెళ్తున్నారు? వెళ్లేటప్పుడు ఫోన్, న్యూస్ పేపర్ తీసుకుని మరీ వెళ్తున్నారా? అయితే, మీరు అనేక రోగాలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టాయిలెట్‌లో గడపడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. టాయిలెట్‌లో ఫోన్ ఎక్కువగా వాడే వ్యక్తులకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంటి సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అలెన్ బెర్మాన్ పాల్గొన్నారు. ఇంతకీ ఎంత సమయం టాయిలెట్‌లో ఉండాలో మీకు తెలుసా?
మీరు టాయిలెట్‌లో ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించడం వల్ల విసర్జన అవయవాలపై అదనపు ఒత్తిడి పడుతుందని నిపుణలు అంటున్నారు. ఇంకా రక్త సరఫరాపై ప్రభావం పడి నాళాలు ఉబ్బుతాయని అంటున్నారు. ఫలితంగా ఇది పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ప్రతి టాయిలెట్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. అదే మీరు టాయిలెట్‌లో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న సాల్మోనెల్లా, ఇ-కొలి వంటి బ్యాక్టీరియాల కారణంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు.
క్యాన్సర్‌కు దారి తీస్తుంది
ఇంకా కొందరు టాయిలెట్‌కి వెళ్లి వచ్చాక హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మర్చిపోతుంటారు. మరి కొందరైతే ఆ ఆలోచన లేకుండానే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఒకవేళ చేతులు కడిగినా మొబైల్ మీద క్రిములు అలాగే ఉండిపోతాయి. ఫలితంగా మీరు తినే ఫుడ్‌తో పాటు ఆ బ్యాక్టీరియా కడుపులోనికి వెళుతుందంటున్నారు నిపుణులు. ఇది అతిసారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం కారణంగా ఇతర సమస్యలు వస్తాయని.. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.