తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు పగటి పూట నిద్ర వస్తుందా? ఈ వ్యాధి వస్తుందని సిగ్నల్ వచ్చినట్లే జాగ్రత్త! - EXCESS SLEEP LEADS COGNITIVE DECLIN

-నిద్ర సమస్యలతో జ్ఞాపశక్తికి సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్స్ -అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్​లో వెల్లడి

Daytime Sleepiness Causes Cognitive Issues
Daytime Sleepiness Causes Cognitive Issuesొ (Getty Images)

By ETV Bharat Health Team

Published : Nov 12, 2024, 12:28 PM IST

Daytime Sleepiness Causes Cognitive Issues: చాలా మంది పగటి పూట నిద్ర వస్తుందంటారు. ఆఫీస్‌కు వెళ్లినా.. ఇంట్లో ఉండి వివిధ పనులు చేస్తున్నా శరీరం సహకరించక ఎప్పుడు నిద్రపోదామా అని ఎదురు చూస్తుంటారు. మీకు కూడా ఇలానే రోజంతా నీరసంగా ఉండి ఎప్పుడు నిద్రపోదామా అని అనిపిస్తోందా? అయితే అలర్ట్​ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి పగటి నిద్ర వల్ల భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వృద్ధుల్లో పగటి పూట నిద్ర రావడం, ఇతర నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో జ్ఞాపశక్తికి సంబంధించిన motoric cognitive risk syndrome (MCR) వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్​లో ఈ విషయం ప్రచురితమైంది. ఎలాంటి నిద్ర సమస్య లేని వారితో పోలిస్తే పగటి పూట ఎక్కువగా నిద్ర రావడం, చురుకుగా లేని వారిలో ఈ వ్యాధి పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఈ రెండింటికి మధ్య గల అసలు కారణాన్ని అధ్యయనంలో వెల్లడించకపోయినా.. నిద్ర సమస్యలకు MCR వ్యాధికి సంబంధం ఉందని తేల్చారు(రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

సుమారు 76 ఏళ్ల వయసు గల 445 మందిపై ప్రత్యేక ప్రశ్నలతో ఈ పరిశోధన చేపట్టారు. నిద్రపోయే సమయంలో తలెత్తిన ఇబ్బందులు? రాత్రి పూట ఎన్ని సార్లు నిద్ర లేచారు? నిద్రపోవడానికి ఏవైనా మందులు వాడారా? లాంటి ప్రశ్నలను అడిగారు. ఇందులో కొందరు పగటిపూట నిద్ర వచ్చిందని.. మరికొందరు తినేటప్పడు, డ్రైవింగ్ చేసే సమయంలోనూ నిద్రగా ఉందని తెలిపారు. ఇందులో 177 మంది సరిగ్గా నిద్ర పోకపోగా.. 268 మంది హాయిగా నిద్రపోయినట్లు వివరించారు.

ఈ పరిశోధన మొదట్లో సుమారు 42 మంది MCR అనే జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధి రాగా.. మరో 36 మందికి మధ్యలో వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. పగటిపూట ఎక్కువగా నిద్ర వచ్చి చురుకుగా లేని వారిలో 35.5శాతం ఈ సమస్య పెరిగినట్లు వివరించారు. ఎలాంటి నిద్ర సమస్యలు లేని వారిలో ఈ వ్యాధి కేవలం 6.7శాతమే సోకే అవకాశం ఉందని అంటున్నారు. వయసు, ఒత్తిడి, ఆందోళన, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఎలాంటి నిద్ర సమస్యలు లేని వారితో పోలిస్తే పగటి పూట నిద్ర వచ్చే వారిలో మూడు రెట్లు Motoric Cognitive Risk Syndrome వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జస్ట్ 5 నిమిషాలు ఇలా చేస్తే హై బీపీ పరార్! ఎలానో తెలిస్తే షాక్ అవుతారు!!

చపాతీలు, ఓట్స్ తింటున్నారా? అయితే, మీకు ఈ వ్యాధులన్నీ వచ్చే ఛాన్స్ ఉందట!

ABOUT THE AUTHOR

...view details