తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ టీ తాగితే - 300 ఉన్న షుగర్ కూడా నార్మల్​కు రావడం పక్కా! - Health Benefits of Mango Peel Tea - HEALTH BENEFITS OF MANGO PEEL TEA

Mango Peel Tea: గుండె జబ్బుల తర్వాత అధిక మంది ఎదుర్కొంటున్న సమస్య.. డయాబెటిస్​. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే వాటితో పాటు మామిడి తొక్క టీ ని తాగమని సలహా ఇస్తున్నారు నిపుణులు. మరి అది ఎలా తయారు చేసుకోవాలి? మామిడి తొక్కతో ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...

Health Benefits of Mango Peel Tea
Health Benefits of Mango Peel Tea

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 10:31 AM IST

Health Benefits of Mango Peel Tea: డయాబెటిస్​.. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్న సమస్య. ఒక్కసారి డయాబెటిక్​ ఎటాక్​ అయ్యిందంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. ఇష్టమైనవి తినడానికి కూడా ఉండదు. కచ్చితమైన డైట్​ ఫాలో అవ్వాలి. ఇన్ని చేసినా అది కంట్రోల్లో ఉంటుందా అంటే.. డౌటే. అయితే కచ్చితమైన ఆహార నియమాలు, సమయానికి మందులు వాడటం వాటిని ఫాలో అవుతూనే మామిడి తొక్కల టీ ని కూడా ట్రై చేయమంటున్నారు నిపుణులు. ప్రతిరోజు ఈ టీ ని తాగడం వల్ల షుగర్​ కంట్రోల్లోకి వస్తుందని అంటున్నారు. మరి మామిడి తొక్కల టీ ని ఎలా తయారు చేయాలి? షుగర్​ కంట్రోల్​ మాత్రమే కాకుండా మామిడి తొక్కతో ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మామిడి తొక్క పోషకాలు సూపర్​:మామిడి తొక్కలో విటమిన్​ C, A, K, పొటాషియం, మాంగనీస్​, మెగ్నీషియం, ఫైబర్​, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్​ వంటి పోషకాలు ఉన్నాయి. అలాగే ఇన్సులిన్​ నిర్వహణలో సహాయపడే మ్యాంగిఫెరిన్​ అనే సమ్మేళనం కూడా ఇందులో ఉంటుంది. మరి దీని ప్రయోజనాలు చూస్తే...

షుగర్​ కంట్రోల్​: మామిడి తొక్కలోని తంతువులలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అలాగే భోజనం తర్వాత కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. అంతేకాకుండా ఈ టీ ని ఇతర పానీయాలతో పోలిస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

2018లో "ఫుడ్ ఫంక్షన్ జర్నల్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 12 వారాల పాటు రోజుకు రెండుసార్లు 250 మిల్లీలీటర్ల మామిడి తొక్క టీ తాగినప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయిలు 12.3శాతం నుంచి 10.7శాతం వరకు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. ఈ పరిశోధనలో తమిళనాడులోని శ్రీ వైష్ణవ మెడికల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లోని డయాబెటాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డా. M. Mahendran పాల్గొన్నారు. మామిడి తొక్క టీ ని తాగిన వారిలో షుగర్​ అదుపులో ఉందని అంతేకాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

జీర్ణక్రియ మెరుగుదల:మామిడి తొక్కలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తి పెరుగుదల:మామిడి తొక్కలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యం మెరుగుదల:మామిడి తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో సహాయపడతాయి. ఇది ముడతలు, ఫైన్ లైన్ల రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం:మామిడి తొక్కలోని ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది. దీంతో ఆహారాన్ని తక్కువ తినేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మామిడి తొక్క టీ ఎలా చేయాలి?

  • కొన్ని మామిడి తొక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి.
  • ఆ గ్లాసులో మామిడి తొక్కలను వేసి చిన్న మంట మీద మరిగించాలి.
  • నీరు బాగా మరుగుతున్న కొద్దీ మామిడి తొక్కలోని సారమంతా నీటిలో కలుస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.
  • దాన్ని వడకట్టి ఆ నీటిని గ్లాసులో పోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు.

మామిడి తొక్కల పొడితో కూడా:మామిడి కాయలు కేవలం వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మామిడి కాయలు దొరకనప్పుడు కూడా ఈ టీ తాగాలంటే పొడి చేసుకోవడం బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు. అందుకోసం..

ఎక్కువ మొత్తంలో మామిడి తొక్కలు తీసుకుని ఎండబెట్టుకోవాలి.

బాగా ఎండిన తర్వాత మెత్తటి పొడి చేసుకుని ఎయిర్​ టైట్​ కంటైనర్​లో స్టోర్​ చేసుకోవాలి.

కూల్​ ఉన్న ప్లేస్​లో ఈ పొడి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

ఈ పొడిని ఎలా వాడాలంటే.. ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్​ పొడిని కలుపుకుని తాగాలి.

అయితే ఇక్కడ పచ్చి తొక్కలు లేదా పండిన తొక్కలు ఏవైనా ఉపయోగించుకోవచ్చు. పచ్చివి ఉపయోగిస్తే రుచి కోసం తేనె కలుపుకోవడం మంచిది. ఎందుకంటే పచ్చి తొక్కలు కొంచెం వగరుగా, కొంచెం చేదుగా ఉంటాయి. పండిన తొక్కలకు ఇవేమి అవసరం లేదు. డైరెక్ట్​గా టీ చేసుకుని తాగొచ్చు..

NOTE:ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details