Health Benefits of Ginger Lemon Water :సమ్మర్ బెస్ట్ హైడ్రేటింగ్ పానీయాల్లో.. అల్లం, నిమ్మకాయ అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి డిటాక్సిఫికేషన్ డ్రింక్ :సమ్మర్లో అల్లం, నిమ్మరసం కలిపిన వాటర్ మంచి డీటాక్సిఫికేషన్ డ్రింక్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందని అంటున్నారు. బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంలో ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది : వేసవిలో అల్లం, నిమ్మరసంతో ప్రిపేర్ చేసుకున్న పానీయం తాగడం.. రోగనిరోధక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండింటిలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
కొబ్బరి నీళ్లు Vs లెమన్ వాటర్- సమ్మర్లో ఏ డ్రింక్ బెస్ట్! నిపుణుల మాటేంటి!
జీర్ణవ్యవస్థకు మేలు :లెమన్, జింజర్ వాటర్ తాగడం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అయితే.. పరిమిత పరిమాణంలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
2018లో "జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు జింజర్ లెమన్ వాటర్ తాగితే చక్కటి రిలీఫ్ పొందుతారని తేలింది. ఈ మేరకు ఓ రీసెర్చ్ కూడా నిర్వహించారట. ఈ పరిశోధనలో లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ మహ్మద్ అలీ పాల్గొన్నారు. అల్లం, నిమ్మరసం వాటర్ తాగడం వల్ల అందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
బరువు కంట్రోల్ : సమ్మర్లో అల్లం, నిమ్మరసం వాటర్ తీసుకోవడం వల్ల పొందే మరో ప్రయోజనమేమిటంటే.. వెయిట్ తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఉదయం లేవగానే నిమ్మరసం తాగుతుంటారు. అలాకాకుండా అల్లం యాడ్ చేసుకొని తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.
ఎందుకంటే.. అల్లం జీవక్రియను పెంచడమే కాకుండా అదనపు కేలరీలను బర్న్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే.. కేవలం ఈ వాటర్‌ను తీసుకుంటే మాత్రమే బరువు తగ్గరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దీనితో పాటు డైలీ వ్యాయామం చేస్తూ.. సరైన ఆహార ప్రణాళికను ఫాలో అయినప్పుడే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సమ్మర్లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ!