Best Habits to Make Brain Powerful: మెదడు మన శరీరంలో జ్ఞానేంద్రియాలన్నింటికీ ముఖ్యమైన కేంద్రం. బ్రెయిన్‌చురుగ్గా పని చేసినన్ని రోజులు మనం ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేస్తామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో మెజార్టీ జనాలు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టైమ్‌తో పరిగెత్తడం వల్ల ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దీనివల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని.. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, మెదడు చురుగ్గా పనిచేయడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వ్యాయామం చేయండి :మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహాం పెరుగుతుంది. దీనివల్లబ్రెయిన్‌కుఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయని నిపుణులంటున్నారు. అలాగే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. కాబట్టి, మీరు డైలీ అరగంట సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించాలని సూచిస్తున్నారు.
జంక్‌ఫుడ్‌కు దూరంగా :ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటున్నారు. అలాగే చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారు. అయితే, వీటిని తరచుగా తినడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
2019లో 'న్యూట్రీషన్ జర్నల్' లో ప్రచురించిని అధ్యయనం ప్రకారం.. జంక్‌ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులలో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనను న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్ బ్రెండా పెన్' నిర్వహించారు. జంక్‌ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
డైలీ 3 బాదం పప్పులు తింటే చాలు- మీ బ్రెయిన్ ఫుల్ యాక్టివ్, గుండె సమస్యలకు చెక్!