Fast Walking Benefits :వేగంగా వాకింగ్ చేసేవారు మధుమేహం, హృదయ, జీవక్రియ సంబంధిత వ్యాధుల ముప్పును తక్కువగా ఎదుర్కొంటారని తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా నడిచేవారితో పోలిస్తే స్పీడ్‌గా వాకింగ్ చేసేవారిలో ఈ వ్యాధులు సోకే ప్రమాదం తక్కువని జపాన్‌లోని దోషిషా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది.
25,000 మందిపై పరిశోధనలు
స్థూలకాయం, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉన్న 25,000 మందిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో వేగంగా వాకింగ్ చేసిన వ్యక్తుల్లో మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే హైపర్ టెన్షన్, డైస్లిపిడెమియా వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే వేగంగా నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై సైంటిస్టులు పరిశోధనలు చేసి పలు కీలక విషయాలను కనుగొన్నారు.
'వేగంగా నడిస్తే ప్రయోజనాలు'
"వేగంగా నడిచేవారు తరచుగా మెరుగైన కార్డియోస్పిరేటరీ ఫిట్ నెస్ ని కలిగి ఉంటారు. వారు తక్కువ స్థాయిలో కడుపు మంట, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగి ఉంటారు. ఈ అధ్యయనం ఊబకాయం, జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై జరిపాం. స్పీడ్ గా వాకింగ్ చేసేవారు బీపీ, డయాబెటిస్, డైస్లిపిడెమియా వంటి వ్యాధులు బారిన పడే అవకాశం తక్కువని తేలింది. " అని దోషిషా యూనివర్సిటీ పొఫెసర్, ప్రధాన పరిశోధకుడు కొజిరో ఇషి తెలిపారు.