Expiry Date for Household Items : చాలామంది మందులు, టానిక్‌లు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందని ఒకసారి చెక్ చేస్తుంటారు. అయితే.. కొన్ని వస్తువులకు మాత్రమే ఇలా చెక్ చేస్తుంటారు. కానీ.. మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? మెజారిటీ జనం కొన్ని వస్తువులను నెలలు, ఏళ్ల తరబడి వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంట్లో గడువు ముగిసే వస్తువులు ఏంటీ? వాటిని ఎన్ని రోజులకొకసారి మార్చాలి? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
కార్పెట్స్ :
చాలా మంది ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కార్పెట్‌ని దులిపి ఎండలో వేసి మళ్లీ ఇంట్లో పరుస్తుంటారు. అయితే, కార్పెట్‌ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల దానిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీనివల్ల శ్వాస సమస్యలు, అలర్జీల వంటివి వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి, కార్పెట్లను తరచూ వాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఆవిరితో శుభ్రం చేసుకోవాలి. మంచి కార్పెట్లు అయితే ఐదారేళ్లు ఉపయోగించుకోవచ్చట.
మ్యాట్రెసెస్ :
చాలా మంది జనాలు మ్యాట్రెసెస్ పైన ఉన్న బెడ్‌షీట్లను వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ.. ఏళ్ల తరబడి వాటినే ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి వీటిని ఉపయోగించడం వల్ల నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల మ్యాట్రెసెస్‌పై బ్యాక్టీరియా, దుమ్ము దూళి వంటివి పేరుకుపోతాయి. ఫలితంగా మనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక మ్యాట్రెసెస్ ఎక్స్‌పైరీ డేట్ 7 నుంచి 10 సంవత్సరాలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వస్తువుల్ని కచ్చితంగా మారుస్తుండాలి.. లేదంటే?
లూఫాలు :
చాలా మందికి స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉంటుంది. అయితే.. కొంత మంది వీటిని వాడిన తర్వాత అలాగే తడి వాతావరణంలోనే పెడుతుంటారు. దీనివల్ల లూఫాపైబ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, లూఫాను వాడిన తర్వాత పూర్తిగా ఎండబెట్టాలి. ప్రతి వారం ఒకసారి వేడి నీటితో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఒక లూఫాను నెలకు మించి వాడకూడదని చెబుతున్నారు.