Facts About Water Bottle Caps Colour: మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఎక్కడికి వెళ్లినా తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటారు. మరికొద్దిమంది చేతిలో వాటర్ బాటిల్ లేకపోతే దగ్గరలోని షాప్‌కు వెళ్లి బాటిల్ కొని తాగుతుంటారు.
వాటర్ బాటిల్స్‌లో కూడా ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. అలాగే బాటిల్ క్యాప్స్ కూడా అనేక రంగుల్లో ఉంటాయి. అయితే.. చాలా మంది వాటర్ బాటిల్ క్యాప్స్ కలర్‌ను బట్టి నీటి క్వాలిటీ మారుతుంది అనుకుంటారు. మరి, ఇది నిజమేనా? అసలు వాటర్ బాటిల్ క్యాప్స్ వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
- బ్లూ కలర్ క్యాప్ ఉంటే ఆ నీరు మినరల్ వాటర్( Mineral Water ) అని అర్ధం. అంటే ఆ నీరు ప్రకృతి జలాల నుంచి సేకరించి ఫ్యూరిఫై చేసి బాటిల్లో ప్యాక్ చేస్తారని అర్థం. ఇది స్వచ్ఛతకు, శుద్ధతకు ప్రతీక అని అంటున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో పోషకాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. 2023లో ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నీలిరంగు క్యాప్‌తో ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 20% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జియాంగ్సీ యూనివర్సిటీ ఆఫ్ ట్రాడిషనల్ చైనీజ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ జియాంగ్ యున్ పాల్గొన్నారు.
- గ్రీన్ కలర్ క్యాప్‌తో కొన్ని కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు క్యాప్‌ను బాటిల్‌కు బిగించారంటే.. అందులో అదనపు ఫ్లేవర్స్ ఉన్నాయని అర్థం. అంటే పుదీనా, నిమ్మరసం ఫ్లేవర్స్ యాడ్ చేసినట్లు అని చెబుతున్నారు.
- ఎరుపు రంగు క్యాప్‌తో ఉండే బాటిల్స్‌లో.. కార్బొనేటెడ్ వాటర్ ఉందని అర్థం.
- అదే విధంగా ఎల్లో కలర్ క్యాప్‌తో ఉన్న వాటర్ బాటిల్లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ ఉన్నట్లు.
- ఇక నలుపు రంగు క్యాప్(Black Cap Water Bottle) కలిగి ఉన్న వాటర్ బాటిల్ విషయానికొస్తే.. ఈ బాటిల్లో ఆల్కలీన్‌తో కూడిన వాటర్ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ బ్లాక్ కలర్ క్యాప్ ఉండే వాటర్ బాటిల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కలర్ క్యాప్స్‌ని కేవలం ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు తాగుతుంటారు.
- పింక్ కలర్ క్యాప్‌తో ఉండే వాటర్ బాటిల్స్ విషయానికొస్తే.. ఇది వాటర్ గురించి చెప్పేది కాదని.. పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి.