Causes Of Mental Stress :మనం ఫిట్‌గా ఉండాలంటే.. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా హెల్దీగా బాగుండాలి. అప్పుడే.. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కానీ.. ఈ రోజుల్లో చాలా మంది మానసికంగా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు.. చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేరు. ఫలితంగా.. సమయానికి పని పూర్తికాక మరింతగా ఒత్తిడికిలోనవుతుంటారు. ఇలా మానసికంగా ఇబ్బంది పడడానికి పెద్ద పెద్ద సమస్యలే కాకుండా.. మనం రోజూ చేసే చిన్నచిన్న పొరపాట్లు కూడా కారణమవుతుయాని నిపుణులు చెబుతున్నారు. అవేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
డూమ్‌స్క్రోలింగ్..
డూమ్‌స్క్రోలింగ్ అంటే ఎక్కువగా నెగెటివ్ అంశాల గురించి ఆలోచించడం. ఇలాంటి వాటి కోసం అదేపనిగా ఫోన్‌లో సర్చ్ చేస్తూ ఉంటారు. కొవిడ్ సమయంలో ఈ పదం ఎక్కువగా వ్యాప్తిలో వచ్చింది. ఇలాంటి ప్రతికూల అంశాల గురించి వెతికి చూస్తూ.. వాటి వల్ల ఎదురయ్యే నష్టాలను తలుచుకుంటూ ఒకవిధమైన భయానికి, ఆందోళనకు గురవుతుంటారు. ఈ పరిస్థితి మనసుపై బాగా ప్రభావం చూపుతుంది. అందువల్ల.. ఇలాంటి నెగెటివ్ న్యూస్ ను సాధ్యమైనంత వరకు పక్కనపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
బిజీ షెడ్యూలింగ్..
నేను ఉదయాన్నే ఈ పని పూర్తి చేయాలి.. ఆ తర్వాత ఇంకొకటి, మధ్యాహ్నం మరొకటి.. అంటూ ఇలా రోజంతా బిజీ షెడ్యూల్‌ను వేసుకోవడం వల్ల కూడా మెదడుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ సరిగా కంప్లీట్ కాకపోతే.. ఒత్తిడి పెరుగుతాయని నిపుణులంటున్నారు. అందువల్ల షెడ్యూల్ బిజీగా ఉండొద్దని సూచిస్తున్నారు.
డెస్క్ వద్దనే భోజనం..
కొంత మంది వర్క్ ప్రెషర్ వల్ల కనీసం.. క్యాంటిన్‌కు వెళ్లి భోజనం చేయలేరు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు వర్క్ చేస్తూనే భోజనం చేస్తుంటారు. ఈ పరిస్థితి మీ తీరికలేని పనిని సూచిస్తుంది. ఇది కూడా మానసిక ఒత్తిడికి గురి కలిగిస్తుంది. అందువల్ల.. ప్రశాంతంగా భోజనం చేయాలని చెబుతున్నారు.
టీవీ చూస్తూ భోజనం..
చాలా మందికి టీవీ చూస్తూ భోజనం చేసే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఎంత తింటున్నారో తెలియదు. పదార్థాల రుచిని కూడా ఆస్వాదించలేరు. ఈ అలవాటు వల్ల కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతారట.