Best Foods for Kidneys Clean:కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైనవి. రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు వ్యర్థాలను బయటకు పంపించేందుకు సహాయపడతాయి. కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే.. ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి. లేకపోతే అవయవాలు పని చేయడం మానేసి ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతుంది. అందుకే.. వాటిని హెల్దీగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మకాయ నీరు:నిమ్మరసంలోని పోషకాలు మూత్ర ఉత్పత్తిని పెంచుతాయని.. తద్వారా కాలుష్య కారకాలను తొలగిపోయి, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుందని అంటున్నారు.
క్రాన్‌బెర్రీస్:కిడ్నీలను క్లీన్‌గా ఉంచడంలో క్రాన్‌బెర్రీస్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా క్రాన్బెర్రీస్లోని యాంటీఆక్సిడెంట్లు, ప్రోయాంతోసైనిడిన్స్.. కిడ్నీలను బ్యాక్టీరియా పెరుగుదల నుంచి రక్షించడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లను (UTIs) నివారించడం ద్వారా కిడ్నీ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
అలర్ట్ : కాళ్ల వాపు కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంకేతమా? - నిపుణుల మాటేంటి? - Nephrotic Syndrome Symptoms
ఆకుకూరలు:ఆకుకూరల్లో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాలే, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు అంటున్నారు. అదనంగా, వాటిలో మెగ్నీషియం ఉంటుందని.. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
అల్లం:అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడతాయని అంటున్నారు. అదనంగా, ఇది మూత్రపిండాలకు మెరుగైన రక్త ప్రసరణను సులభతరం చేస్తుందని చెబుతున్నారు.
యాపిల్స్:యాపిల్ ప్రతిరోజూ తింటే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతారు. యాపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు సైతం దూరంగా ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్.. సహజమైన మూత్రవిసర్జన, శరీరం నుంచి మలినాలను అంటిపెట్టుకుని, బయటకు పంపడం ద్వారా మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుందని అంటున్నారు.