Best Fashion Tips to Look Like Young: పెరుగుతున్న వయసుకుతోడు వివిధ రకాల కారణాలతో.. చాలా మంది తమ ఏజ్ కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం వల్ల యంగ్‌గా కనిపించొచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
హెయిర్ స్టైల్స్: అందంగా కనిపించాలంటే ముఖం నీట్‌గా ఉండటం ఎంత ఇంపార్టెంటో.. హెయిర్ స్టైల్స్ కూడా అంతే ముఖ్యం. మీ లుక్స్‌ని హెయిర్ స్టైల్స్ బాగా డామినేట్ చేస్తాయి. ఎందుకంటే.. మీరు అందంగా కనిపించాలన్నా.. అందవిహీనంగా కనిపించాలన్నా వీటి పాత్రే ఎక్కువ. కాబట్టి మీరు చేయాల్సినదల్లా హెయిర్ స్టైల్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించడం. అందుకని.. మీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుందో గుర్తించి.. వాటిని ట్రై చేయాలి. జుట్టును స్టైల్ చేయడం, కర్ల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటే.. ఇవి మీరు యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. మధ్యపాపిడి తీస్తే.. మీరు వయసుకన్నా పెద్దవారిగా కనిపిస్తారు. సైడ్ పార్టీషన్స్ కాస్త యంగ్‌లుక్ ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
మేకప్..:ట్రెండీగా రెడీ అయ్యేవారు మేకప్‌పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే సంప్రదాయంగా ఉండేవారు కూడా కొన్ని రెగ్యూలర్‌గా ఫాలో అవ్వాలి. సంప్రదాయ దుస్తులు వేసుకున్నప్పుడు ముఖానికి కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ లుక్‌ని బెటర్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ముఖానికి తగ్గట్లుగా బొట్టు సైజ్ ఉండాలని.. పెద్ద బొట్టు పెట్టుకుంటే అది హుందాగా కనిపించినా.. మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చిన్న సైజ్ బొట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదంటున్నారు.
దుస్తులు:కొన్ని దుస్తులు మీకు కంఫర్ట్‌గా ఉండొచ్చు కానీ.. మిమ్మల్ని పెద్దవారిగా చూపిస్తాయంటున్నారు. రౌండ్ నెక్స్ మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్ డ్రెస్‌లు లేదా షర్ట్లు ట్రై చేయమంటున్నారు. అలాగే కుర్తాలు వేసుకుంటే దుప్పటాను రెండు సైడులు కాకుండా వన్ సైడ్ వేసుకుంటే యంగ్‌గా కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా మీ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే రంగుల దుస్తులు ఎంచుకోవాలంటున్నారు. ఇవి కూడా మీరు అందంగా కనిపించండంలో మేజర్ పాత్ర పోషిస్తాయి.