తెలంగాణ

telangana

ETV Bharat / health

పెయిన్ కిల్లర్స్​ ఎక్కువగా వాడుతున్నారా? పసుపు, అల్లం, తులసి అద్భుత ఔషధం- ట్రై చేయండి! - Ginger health benefits

Ayurvedic Painkillers : మీరు కీళ్ల నొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? వీటిని తగ్గించుకోవడానికి తరచూ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని విడిచిపెట్టండి. మీ వంటింట్లోనే అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ayurvedic Painkillers
Ayurvedic Painkillers

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 5:43 PM IST

Ayurvedic Painkillers : తలనొప్పి, కాళ్లు, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి, ఇలా ఏ సమస్య వచ్చినా మనలో చాలా మంది అల్లోపతి మందులను వాడుతుంటారు. దగ్గర్లో ఉన్న ఏదో మెడికల్ స్టోర్​కు వెళ్లి పెయిన్ కిల్లర్స్​ను కొనుగోలు చేస్తుంటారు. నిజానికి ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం అంత శ్రేయస్కరమేమీ కాదు. డాక్టర్​ సూచనలు లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడేవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు పాడైపోవడం, లివర్ దెబ్బతినడం లాంటి ప్రమాదకరమైన జబ్బులకు లోనయ్యే అవకాశ ఉంది. నొప్పి అనగానే ఇలాంటి రసాయన మందులు కోసం ఆలోచించే వారు, తమ వంటింట్లోనే ఉన్న దివ్యమైన ఆయుర్వేదిక్ ఔషధాల గురించి తెలుసుకోలేకపోతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మన ఇంట్లో నిత్యం ఉండే పసుపు, అల్లం, తులసి మంచి పెయిన్ కిల్లర్స్​గా పనిచేస్తాయని చాలామందికి తెలియదు. వీటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే, ఎలాంటి సమస్యను అయినా సులువుగా తగ్గించుకోవచ్చు. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పసుపు
Turmeric Health Benefits : మనలో చాలా మందికి పసుపు ఒక సహజ నొప్పి నివారిణి అని తెలియదు. ఏదైనా చిన్నగాయం తగిలిన వెంటనేపసుపు పూస్తే రక్తం గడ్డ కడుతుంది. నొప్పి కూడా తగ్గుతుంది. పసుపుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో పసుపునకు విశేష ప్రాధాన్యం ఉంది. పసుపులో యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. గాయాలు, చర్మ వ్యాధులు తగ్గడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. పసుపు ఉన్న చోట బ్యాక్టీరియా వ్యాపించదు. ఫ్లూ లాంటి వైరస్​లు నశిస్తాయి. అందుకే మన పూర్వీకులు ఇంటి గుమ్మాలకు పసుపు రాసేవారు. పసుపు వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరవు. నోటి పూత వచ్చినప్పుడు పసుపు రాస్తే వెంటనే తగ్గిపోతుంది.

అల్లం
Ginger Health Benefits : వంటల్లో రుచికోసం వేసే అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి. శరీరంలో నొప్పి పుట్టించే హర్మోన్లను అదుపు చేయడానికి అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు నీరసంగా ఉన్నా, వికారంగా అనిపిస్తున్నా, చిన్న అల్లం ముక్క తింటే క్షణాల్లో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గర్భిణులు వికారంతో బాధపడుతుంటే, దానికి విరుగుడుగా అల్లం వాడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

తులసి
Holy Basil Health Benefits : ప్రతి ఇంట్లో పూజలు అందుకునే తులసి కూడా అద్భుత నొప్పి నివారిణి. మూలికా వైద్యంలో తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసితో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడుపు మంటను, ఒంటి నొప్పులను తులసి తగ్గిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ వైరస్​కు తులసితో చెక్ పెట్టవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. తులసి శరీరంలో కొన్ని హర్మోన్ల విడుదలను నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ విధంగా తులసి, పసుపు, అల్లం లాంటి మన వంటింట్లోని సహజ, ఆయుర్వేదిక ఔషధాలు మనల్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. సాధారణంగా వీటిని డాక్టర్ల సలహాలు తీసుకోకుండానే వాడుకోవచ్చు. కానీ, యాంటిబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్​ వాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డిప్రెషన్​లో ఉన్నారా? తొక్క తీయకుండా యాపిల్ తింటే మీ మూడ్​ సెట్​​!

లైకుల బాధ, కామెంట్ల వార్ - సోషల్‌ మీడియా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details