Ayurvedic Home Remedies For Dandruff Problem :మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాటిలో జుట్టు కూడా ఎంతో ముఖ్యమైనది. అందుకే మనలో చాలా మంది జుట్టుపట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ మధ్య కాలంలో అనేక జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు ఏర్పడటం లాంటి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కాగా చాలామంది జుట్టులో అధికంగా ఉండే చుండ్రు లేదంటే డాండ్రఫ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ సమస్యలన్నింటికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
హెయిర్ ఫాల్‌కు ఆయుర్వేద పరిష్కార మార్గాలు
చుండ్రు లేదా డాండ్రఫ్ నుంచి వెంట్రుకలకు విముక్తి కోసం మార్కెట్లోని అనేక షాంపులు, ఆయిల్‌లను ట్రై చేసి విసిగిపోతూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో మొండి సమస్యగా ఉన్న చుండ్రు లేదా డాండ్రఫ్ నివారణకు చక్కటి ఉపాయం చెప్పడం జరిగింది. ఆయుర్వేదంలో వివరించిన విధంగా చేస్తే మాత్రం చుండ్రు సమస్య నుంచి విముక్తి లభించడంతో పాటు శాశ్వత పరిష్కారం పొందవచ్చు.
ఆయుర్వేదంలో చుండ్రు లేదా డాండ్రఫ్ నివారణకు చక్కటి తైలాన్ని తయారు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ తైలాన్ని పారిజాతం గింజలు, వేపాకు, అతిమధురం, కరక్కాయ, ఉసిరికాయ, కొబ్బరినూనెలతో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ తైలాన్ని తయారు చేసుకోవడానికి ముందు ఇప్పటి వరకు చెప్పిన అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
తైలాన్ని తయారు చేసే విధానం ఇదే
- ముందుగా స్టవ్ వెలిగించి, దానిపై పాత్ర పెట్టుకోవాలి
- అందులో 2లీటర్ల నీళ్లు పోసి, దానిలోనే 200గ్రాముల కొబ్బరి నూనె వేసుకోవాలి
- ఈ మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు ఎండిపోయిన ఉసిరికాయ చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- అందులోనే కరక్కాయ చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- ముందుగా సిద్ధం చేసుకున్న వేపాకు చూర్ణం 50గ్రాములు కలుపుకోవాలి.
- ఇందులోకి అతిమధురం చూర్ణాన్ని 50గ్రాముల పరిమాణంలో వెయ్యాలి.
- అలాగే పారిజాతం ఎండిన గింజల చూర్ణాన్ని 50గ్రాములు వేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని నీరు ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి.
- నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలిన తర్వాత ఈ తైలాన్ని వడగట్టుకోవాలి.