తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే మీ దంతాలు దెబ్బతినడం ఖాయం! - Avoid These Foods for Healthy Teeth

These Foods to Avoid for Healthy Teeth : దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా, స్ట్రాంగ్​ ఉండాలంటే బ్రష్ చేసుకోవడం మాత్రమే కాదు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.

Teeth
Healthy Teeth

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 5:13 PM IST

Avoid These Foods for Healthy Teeth :మన దంతాలు ఆరోగ్యంగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మనం ఏ ఆహారం తినాలన్నా నోటి నుంచే తింటాం. కాబట్టి పళ్లు, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేయాలి. అయితే దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బ్రష్ చేసుకోవడం మాత్రమే కాదు మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. కాబట్టి ఫుడ్​ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దంతాలలో సమస్యలు, చిగుళ్లలో నొప్పి, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. కాబట్టి దంతాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్​గా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సిట్రస్ ఫ్రూట్స్ : పళ్లు హెల్దీగా ఉండాలంటే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే వాటిలో ఉండే యాసిడ్ దంతాలపై ఆమ్ల ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతిని దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాటిని తింటే ఆ తర్వాత నోరును శుభ్రం చేసుకోండి.

పికిల్స్ : దంతాలు బలహీనంగా మారకూడదంటే మీరు పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. సాధారణంగా ఊరగాయలకు మంచి రుచిని అందించడానికి వెనిగర్‌లో నానెబడతారు. కానీ, రోజుకు ఒక ఊరగాయను తినడం వల్ల దంతాలు అరిగిపోయే అవకాశాలు 85% పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి డైలీ తినకుండా అప్పుడప్పుడు తినడం మంచిది అంటున్నారు నిపుణులు.

సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్ :ఇవి కూడా నోటి ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే సోడాలో సిట్రిక్, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఆమ్ల స్థాయి పెరిగి దంత సమస్యలు వస్తాయి. అలాగే సోడాను ఎక్కువగా తాగడం వల్ల పళ్ల చుట్టూ ఉండే లాలాజలంపై ప్రభావం చూపడం ద్వారా దంతాలు క్షీణిస్తాయి. ఇక స్పోర్ట్స్ డ్రింక్స్ తాగడం వల్ల వాటిలో ఉండే చక్కెర పళ్ల మీద పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా దంతక్షయం వంటి పంటి సమస్యలకు దారితీయవచ్చు.

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

కాఫీ, టీ : మీ పళ్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే కాఫీ, టీలను తగ్గించుకోవడం మంచిది. కాఫీ తీసుకోవడం ద్వారా మీ దంతాలు రంగును కోల్పోతాయి. ఇక బ్లాక్​ టీలో టానిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ దంతాలపై మరకలను ఏర్పరుస్తుంది. కాబట్టి మీ దంతాలు ముత్యాల మాదిరిగా మెరవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ టానిన్​ కంటెంట్ టీ లను తాగడం మంచిది.

డ్రై ఫ్రూట్స్ : నిజానికి ఇవి ఆరోగ్యానికి మంచివైనప్పటికీ దంతాల ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు. పిస్తా, బాదం, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటివి మీ పళ్లను దెబ్బతీస్తాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల దంతాలకు అతుక్కుపోయి కుహరంలో సమస్యలు తలెత్తుతాయి. దాంతో నోటి నుంచి దుర్వాసన రావడమే కాకుండా దంతాలలో బ్యాక్టీరియా ఉత్పత్తి కావడం వల్ల అవి పాడవుతాయి.

చక్కెర ఆహారాలు : కుకీలు, కేకులు, చాక్లెట్ వంటి చక్కెర ఆహారాలు దంతాలకు హానికరం. ఈ ఆహారాలలోని చక్కెర పళ్ల మీద పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది దంతాల మీద ఫలకం ఏర్పడటానికి, దంత క్షయానికి దారితీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది. ఇవేకాకుండా యాపిల్ సైడర్ వెనిగర్, టమాట సాస్, రుచిగల చిప్స్, మిఠాయిలు, ఆల్కహాల్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.

దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్​తో రిజల్ట్​ పక్కా!

ABOUT THE AUTHOR

...view details