తెలంగాణ

telangana

ETV Bharat / health

మీరు యాపిల్‌ పండ్లని పొట్టు తీసి తింటున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - Benefits Of Apple Peel - BENEFITS OF APPLE PEEL

Apple Peel Benefits : యాపిల్‌ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, మెజార్టీ జనాలు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కూడా.. పొట్టు తీసి తింటుంటారు. మరి.. ఇలా తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా??

Apple Peel
Apple Peel Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 10:03 AM IST

Amazing Health Benefits Of Apple Peel :ఎంతో రుచిగా ఉండే యాపిల్‌ పండ్లు మనకు ఆకలిని తీర్చడమే కాదు.. రోజులో మనకు కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తాయి. బరువు తగ్గడం నుంచి మొదలు పెడితే.. గుండె ఆరోగ్యం వరకు ఇలా ఎన్నో బెన్‌ఫిట్స్‌ యాపిల్‌ ద్వారా పొందవచ్చు. అయితే.. చాలా రుచిగా ఉండదనో, తినటానికి ఇష్ట పడకనోగాని , సరిగా జీర్ణం కాదనో, పురుగుమందుల అవశేషాలుంటాయనో యాపిల్‌ని పొట్టు తీసి తింటుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా ? అయితే, ఈ స్టోరీ తప్పకుండా చదవండి!

పోషకాలు ఎక్కువే!
యాపిల్‌ పొట్టులో విటమిన్ ఎ, సి,కె వంటి వాటితో పాటు, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అందడానికే చెక్కు తీయకుండా యాపిల్‌ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫైబర్ పుష్కలంగా :
పొట్టు తీయకుండా ఉండే యాపిల్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. తొక్క తీయని యాపిల్‌ తినడం వల్ల మధుమేహంతో బాధపడేవారు ఎక్కువసేపు ఆకలి కాకుండా చూసుకోవచ్చు!

లంగ్స్‌ ఆరోగ్యంగా :

యాపిల్‌ పొట్టులో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. అలాగే యాపిల్‌ పొట్టులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి లంగ్స్‌ ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తాయి.

అలర్ట్ : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - అయితే, మీ బ్రెయిన్​కు ముప్పు పొంచి ఉన్నట్టే!

గుండె ఆరోగ్యంగా :
యాపిల్ పొట్టులో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె కణాలను నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, యాపిల్‌ పండుని పొట్టుతో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులంటున్నారు.

2019లో 'న్యూట్రిషన్, మెటబాలిజం అండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్' జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. యాపిల్‌ని తొక్కతో పాటు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పారిస్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ పారిస్ (UPEC)లో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ 'డాక్టర్ అడిలా సిరి' పాల్గొన్నారు. యాపిల్ తొక్కలలోని పాలీఫెనోల్స్‌.. రక్త నాళాల పనితీరును మెరుగుపరచడం, LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం వంటి గుండె ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తాయని వారు పేర్కొన్నారు.

కొలెస్ట్రాల్​ తగ్గాలని మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ - ఈ నేచురల్​ పద్ధతులతో ఇట్టే కరిగిపోద్ది!

బరువు తగ్గడానికి :
యాపిల్ పండుని పొట్టు తీసి తింటే త్వరగా జీర్ణమవుతుంది. అయితే, యాపిల్‌ పొట్టుతో పాటు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే కడుపు నిండినట్లుగా అనిపించి తక్కువ ఆహారం తింటామని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇలా శుభ్రం చేయండి!
యాపిల్‌ పండ్లపైన పురుగు మందులు, మైనపు పూత వంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటిని తినే ముందు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా వేయండి. తర్వాత ఇందులో ఉప్పు కూడా కలపండి. ఈ నీటిలో ఒక అరగంట సేపు యాపిల్‌లను నానబెట్టండి. తర్వాత, చేతులతో బాగా రుద్ది కడిగి కట్‌ చేసుకుని తినొచ్చు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్​ నుంచి షుగర్ సమస్య దాకా - ఆ సమయంలో కరివేపాకు తింటే అన్నీ సెట్!

షుగర్ బాధితులకు - ఈ పండ్లు అమృతంతో సమానం!

ABOUT THE AUTHOR

...view details