తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్​ 'రామాయణ'లో విశ్వంభర విలన్​! - Vishwambara Villain Ramayana - VISHWAMBARA VILLAIN RAMAYANA

Vishwambara Villain Ranbir Kapoor : రణ్​బీర్ కపూర్​-సాయి పల్లవి కలిసి నటిస్తున్న రామాయణ సినిమాలో విశ్వంభర విలన్​ నటిస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఆయన ఎవరంటే?

source ETV Bharat
Vishwambara Villain Ranbir Kapoor (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 3:14 PM IST

Vishwambara Villain Ranbir Kapoor :బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్​ మూవీ రామాయణ. నితేశ్‌ తివారీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్​ అల్లు అరవింద్ కూడా భాగమయ్యారు! ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్​గా మారగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చకర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో నటుడు భాగం కానున్నట్లు తెలిసింది.

అతని పేరే కునాల్‌ కపూర్‌. ఈయన రామాయణలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయనకు స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారని బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడాయన తన పాత్ర కోసం రిహార్సిల్స్‌ చేస్తున్నారని సమాచారం. అయితే, ఈ పాత్రకు సంబంధించిన వివరాలేమి తెలియలేదు. దీనిని మూవీ టీమ్​ గోప్యంగా ఉంచాలని అనుకుంటోందట.

మరో విషయం ఏంటంటే కునాల్ కపూర్​ తెలుగులో మెగాస్టార్​ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభరలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయన విలన్‌ పాత్రలో(Vishwambara Villain) కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక రామాయణ(Ramayan Movie Shooting Updates) సినిమా విషయానికొస్తే రెండు భాగాలుగా తీయబోతున్నారట. 2025 డిసెంబర్‌ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. షూటింగ్ కోసం పన్నెండు భారీ సెట్లను కూడా సిద్ధం చేశారట. అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. భారీ బడ్జెట్​, 3డీ ఫార్మాట్​తో సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే మూవీ షూటింగ్‌ ప్రారంభమైపోయింది. చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవిగా నటిస్తున్నారు. రావణుడిగా యశ్‌(Yash Raavan), హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్​ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి మనవడితో ప్రముఖ హీరోయిన్ డేటింగ్!​ - వీడియో వైరల్ - Manushi Chhillar Boyfriend

గ్రాండ్​గా బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ సెలబ్రేషన్స్​ - ఆహ్వాన పత్రిక ఇదే! - NBK 50 years celebrations

ABOUT THE AUTHOR

...view details