Thangalaan OTT :వెర్సటైల్ యాక్టర్ విక్రమ్- స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన 'తంగలాన్' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. 2024 ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. పలు కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా మేకర్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్కు లైన్ క్లియర్ చేశారు.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. హీరోయిన్లు మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిచగా, స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.
ఇదీ కథ
1850ల్లో బ్రిటీష్ వారి పాలనా కాలంలో జరిగే స్టోరీ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్ (విక్రమ్). ఆయన భార్య గంగమ్మ (పార్వతి తిరువోతు). వీళ్లకు ఐదుగురు సంతానం. ఊళ్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ వాళ్లు తమ జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంటారు. అయితే ఓసారి వాళ్లు పండించిన పంటను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. సరిగ్గా అప్పుడే పన్ను కట్టలేదన్న నెపంతో తంగలాన్ భూమిని ఆ ఊరి జమిందారు స్వాధీనం చేసుకుంటాడు.