Maharaja Movie Tickets:తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్లో తెరకెక్కిన 'మహరాజా' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో వీకెండ్లో థియేటర్లలో హౌస్‌ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది.
ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ రోజు కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. గత 24 గంటల్లోనే దాదాపు 2 లక్షలు అమ్ముడయ్యాయి. దీంతో ప్రముఖ మూవీటికెట్ బుకింగ్ వెబ్సైట్లో 'మహారాజా' ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. లాంగ్ వీకెెండ్లో టికెట్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
వసూళ్లలో జోరు: ఓపెనింగ్ రోజే సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ రావడం, వీకెండ్ కావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా కలెక్షన్లు కూడా ఊపందుకున్నాయి. డే-1 ఇండియావైడ్‌గా అన్ని భాషల్లో కలిపి రూ.4.7 కోట్లు నెట్ సాధించగా, డే- 2 రూ. 7.25కోట్లు వసూల్ చేసింది. మరో రెండు రోజులు కూడా హాలీడేస్ కావడం వల్ల కలెక్షన్లు ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంది.