96 Movie Sequel : చిత్ర పరిశ్రమలో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో చిత్రాలొచ్చినా అందులో ఏదో ఒక కొత్తదనాన్ని వెతుక్కొని మరీ ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటారు. అలాంటి ఓ ప్రేమకథే '96'. సున్నితమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత మనసులను దోచేసింది. క్లాసిక్ హిట్‌గా నిలిచింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష పోషించిన రామ్ - జాను పాత్రలు, వారి ప్రేమప్రయాణం సినీ ప్రియుల మనసుల్ని ఎంతగానో హత్తుకుంది.
ఇప్పటికీ ఈ సినిమాను ఆడియెన్స్ పలు సార్లు చూస్తూనే ఉంటారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రేమ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దర్శకుడు ప్రేమ కుమార్ కూడా 96 సీక్వెల్ కోసం రెడీ అవుతున్నట్లు గతంలో ఓ సారి తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు.
ప్రస్తుతం '96' షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్రిష, విజయ్‌ల కాల్‌షీట్స్ ప్రకారం ఈ షూటింగ్‌ను ప్లాన్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.