తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్ - VIJAY DEVARKONDA VD 12 MOVIE

కేరళలోని ఫ్యాన్స్‌ మీట్‌లో VD 12 గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ

Vijay Devarkonda VD 12 Movie
Vijay Devarkonda VD 12 Movie (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 3:17 PM IST

Vijay Devarkonda VD 12 Movie : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ - దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కున్న సినిమా 'VD 12' (వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్​గా కేరళలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందీ చిత్రం.

అయితే తాజాగా ఈ సినిమాను ఉద్దేశించి ఫ్యాన్స్‌ మీట్‌లో మాట్లాడారు విజయ్‌. ప్రకృతి అందాల మధ్య చిత్రీకరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. కేరళలో యాక్షన్‌ సీన్స్​ను షూట్​ చేసినట్లు తెలిపారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, ఇది అందరి మనసులకు దగ్గరవుతుందని, అలానే మంచి జ్ఞాపకాలను ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం కేరళలో విజయ్‌ ఫ్యాన్స్‌ మీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

వీడీ 12 చిత్రీకరణ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. రీసెంట్​గా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ అయితే నిర్మాణ సంస్థ స్పందించింది. "డియర్‌ రౌడీ ఫ్యాన్స్‌ మీకు మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు మూవీ టీమ్ చాలా కష్టపడుతోంది. 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. లీక్​ అయిన ఫొటోలను షేర్‌ చేయొద్దు" అని నెటిజన్లను, అభిమానులను కోరింది.

సినిమాలో విజయ్‌ దేవరకొండ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. విజయ్‌ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూపించనున్నారని మూవీటీమ్ చెబుతోంది. వచ్చే ఏడాది మార్చి 28న చిత్రం రిలీజ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానుంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. "విధి పిలిచింది, రక్తపాతం ఎదురుచూస్తోంది, కొత్త రాజు ఉద్భవిస్తాడు" అని టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తి పెంచింది మూవీ టీమ్.

విజయ్​ దేవరకొండ చేస్తున్న సినిమాల్లో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఒకటి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో 1854 - 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. ఇందులో విజయ్‌ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.

'రోలెక్స్'​కు ఆ సినిమాతో కనెక్షన్స్​ - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య

212 రోజులు, 6 షెడ్యుల్స్​లో షూటింగ్​​ - రెండు భాగాలుగా అనుష్క కొత్త సినిమా

ABOUT THE AUTHOR

...view details