Pushpa 2 VS Chhava : సోషల్ మీడియాలో 'పుష్ప 2' తుపాను మొదలైపోయింది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా పుష్ప రాజ్ మేనియానే కనపడుతోంది. డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ వసూళ్లను సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు.
పైగా పుష్ప రాజ్‌కు సౌత్ కన్నా నార్త్‌లో మరింత క్రేజ్ ఎక్కువ! మొదటి భాగం విడుదల సమయంలోనే నార్త్‌లో పుష్పకు ఊహించని రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. అక్కడి వారంతా పుష్ప రాజ్ యాటిట్యూడ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. దీంతో బాలీవుడ్లో పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అక్కడి వాళ్లంతా ఈ సినిమా కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.
Chhava 2 Movie Postpone :అయితే బీటౌన్‌లో పుష్ప 2కు పోటీగా 'ఛావా' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న బాక్సాఫీస్ ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంది. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. పుష్ప 2కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా వేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 14కు వాయిదా పడినట్లు తెలిపింది.