తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగులో రానున్న 'ప్రేమలు' - ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు సందడి చేయనున్నాయంటే ? - మార్చి రిలీజ్ ఓటీటీ మూవీస్

Upcoming Movies Releasing in Telugu : ఈ వారం అటు థియేటర్లలోతో పాటు ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్​లు రానున్నాయంటే ?

Upcoming Movies Releasing in Telugu
Upcoming Movies Releasing in Telugu

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 10:48 AM IST

Upcoming Movies Releasing In Telugu: సినీ లవర్స్​ ఎంతగానో ఎదురుచూసే రోజు శుక్రవారం. ఆ నాడు బాక్సాఫీస్​ వద్ద కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇక ప్రతి సారి లాగే ఈ సారి కూడా మూవీ లవర్స్​ను అలరించేందుకు తమ సినిమాలతో మేకర్స్​ థియేటర్లోకి వచ్చేశారు. ఇక ఈ సారి పండగ (శివరాత్రి) కూడా కలిసి రావడం వల్ల ఈ సందడి మరింత ఎక్కువగా ఉండనుంది. మరి, అటు థియేటర్లలోతో పాటు ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయంటే ?

థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు
మ్యాచోమ్యాన్ గోపీచంద్‌ హీరోగా కన్నడ డైరెక్టర్ ఎ. హర్ష తెరకెక్కించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్‌ మూవీ 'భీమా' మార్చి 8న ఈ సినిమా రిలీజ్​ కానుంది. దీంతో పాటు విశ్వక్‌ సేన్‌ లీడ్​ రోల్​లో వస్తున్న అడ్వెంచర్‌ డ్రామా 'గామి' కూడా 8న విడుదల కానుంది.

ఇటీవలే మలయాళంలో సూపర్ హిట్​ టాక్ అందుకున్న 'ప్రేమలు' మూవీ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉండగా, అజయ్‌ దేవగణ్‌ 'షైతాన్‌' కూడా ఇదే రోజు థియేటర్లలో సందడి చేయనుంది.

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన 'రికార్డ్‌ బ్రేక్‌' మూవీ కూడా ఇదే రోజున రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. వీటితో పాటు 'లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌', 'రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి', మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే :

'వ‌ళ‌రి' - ఈటీవీ విన్‌ - మార్చి 6

నెట్‌ఫ్లిక్స్‌ :
ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8

ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7

డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8

అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్‌ ప్లేయర్‌లో కూడా)

కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8

డిస్నీ+ హాట్‌స్టార్‌
షో టైమ్‌ (హిందీ): మార్చి 8

సోనీలివ్‌
మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7

OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ - ఒక్కో ఎపిసోడ్​ సీట్ ఎడ్జ్​ థ్రిల్​తో!

మార్చి నెల ఓటీటీ సినిమా సిరీస్​ల ఫుల్ లిస్ట్​ - హనుమాన్​తో పాటు ఏం వస్తున్నాయంటే?

ABOUT THE AUTHOR

...view details