తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సోదరి మరణించిన కొన్ని గంటలకే బుల్లితెర నటి మృతి - Tv Actress Dolly Sohi Died

Tv Actress Dolly Sohi Died : బుల్లితెర నటి డాలీ సోహి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.

Tv Actress Dolly Sohi  Died
Tv Actress Dolly Sohi Died

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 12:19 PM IST

Updated : Mar 8, 2024, 1:13 PM IST

Tv Actress Dolly Sohi Died : హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ బుల్లితెర నటి డాలీ సోహి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అయితే కామెర్ల చికిత్స తీసుకుంటూ తన సోదరి అమన్‌దీప్‌ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ బాధాకరమైన విషయాన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

"డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో హాస్పిటల్​లో చికిత్స తీసుకున్నారు. అయితే అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూయగా, డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు" అంటూ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

'దేవోన్​ కా దేవ్ మహాదేవ్​', 'కుంకుమ్​ భాగ్య్​', 'హిట్లర్ దీదీ', 'మేరీ ఆషికీ తుమ్​ సే హీ', 'పరిణితి', 'సింధూర్​ కీ కీమత్​' లాంటి సీరియల్స్​లో డాలీ నటించారు. చివరిసారి గతేడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా సరే అది సులభమే అవుతుంది. క్యాన్సర్‌ వచ్చిందంటూ బాధపడుతూ ఉండిపోవాలా లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని అందరికీ ఇన్​స్పిరేషన్​గా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది" అంటూ అందరిలో ధైర్యాన్ని నింపారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమెకు 'గెట్​వెల్​ సూన్'​, 'స్ట్రాంగ్ లేడీ' అంటూ కామెంట్లు పెట్టారు. ఇంతలోనే ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

అరుదైన వ్యాధితో దంగల్ నటి మృతి
బాలీవుడ్​కు చెందిన సుహానీ భట్నాగర్‌ (19) డెర్మటోమయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో కన్నుమూసింది. దంగల్ సినిమాలో చిన్నారి బబితాగా నటించింది ఈమె. తన మృతి అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ కూడా సుహానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "సుహానీ కన్నుమూసిందన్నవార్త మా మనసుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఆమె లేకుండా 'దంగల్‌' సినిమా అసంపూర్ణం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ ఆ సంస్థ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

సినీ పరిశ్రమలో విషాదం- ప్రముఖ సీనియర్​ నటి కన్నుమూత

క్యాన్సర్​తో 2017 మిస్​ ఇండియా ఫైనలిస్ట్ కన్నుమూత​

Last Updated : Mar 8, 2024, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details