Tollywood Movies Hit In TV But Not In Theatres :ఇప్పుడు అంతటా రీరిలీజ్ మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పలు స్టార్ల సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేశాయి. ఒకప్పుడు థియేటర్లలో అంతగా ప్రేక్షకాదరణ పొందని సినిమాలు కూడా ఆ తర్వాత ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలోనే కాదు బుల్లితెరపై కూడా మంచి టాక్ అందుకుంటుంటాయి. ఈ లిస్ట్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అవేంటంటే ?
పోతురాజు:
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ నటించిన 'పోతురాజు' సినిమా కూడా తొలుత థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరతో పాటు యూట్యూబ్‌లోనూ రికార్డు స్థాయిలో వ్య్వూస్ అందుకుంది.
ఆరెంజ్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ 'ఆరెంజ్'. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే బుల్లితెరపై ఈ చిత్రానికి విశేషాదరణ దక్కింది. ఇటీవలే రీరిలీజ్‌లోనూ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు.
ఓయ్:
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా తాజాగా పలు లవ్ మూవీస్ థియేటర్లలో సందడి చేశాయి. అందులో 'ఓయ్' సినిమా ఒకటి. అప్పుడు టాక్ అందుకోని ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఓ రేంజ్లో చూశారు. టీవీలో కూడా సూపర్ టాక్ అందుకుంది ఈ మూవీ.
ఖలేజా:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఖలేజా. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరించలేదు. అయితే టీవీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.