Thandel Movie Bujji Thalli Song :నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'తండేల్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కథ, హీరో, హీరోయిన్ల యాక్టింగ్‌తో పాటు సాంగ్స్ కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. ముఖ్యంగా 'బుజ్జి తల్లి' సాంగ్‌తో పాటు దాని ఆధారంగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గత కొంతకాలంగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
సినిమా రిలీజ్‌కు ముందునుంచే తెగ వైరల్ అవుతోన్న ఈ సాంగ్ ఇప్పుడు ఓ స్పెషల్ రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా షేర్ చేసుకుంది. బిగ్‌స్క్రీన్‌పై ఈ పాటను ఎక్కువ మంది ఎంజాయ్ చేశారంటూ రాసుకొచ్చింది.
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతానికి జావేద్ అలీ వోకల్స్ తోడవ్వడం వల్ల ఓ మ్యాజిక్ క్రియేట్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. ఇక శ్రీమణి సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోసిందని కామెంట్ చేస్తున్నారు. మరోవైవు బుజ్జితల్లి సాంగ్ శాడ్ వెర్షన్ కూడా నెట్టింట తెగ వైరలవుతోంది. థియేటర్‌లలోనూ ఈ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
స్టోరీ ఏంటంటే :
సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే 'తండేల్'. తన తండ్రి తండేల్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర నుంచి ఓ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని వింటూ వాళ్లకోసం నిలబడటం వల్ల అందరూ అతడ్నే 'తండేల్'గా ఎంచుకుంటారు. ఇక రాజుకి తన చిన్నప్పటి ఫ్రెండ్ సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ తనను ప్రేమగా పిలుస్తుంటాడు.