Suhas New Movie Prasanna Vadanam :తాను హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు యంగ్ హీరో సుహాస్. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు ప్రసన్న వదనం అనే మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో చూస్తుంటే ఆయన ఇప్పటి వరకు మనం వినని ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రోసోపాగ్నోసియా ఒక అరుదైన సమస్య ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు.
ఇంతకీ ప్రోసోపాగ్నోసియా ఏంటంటే ?
ప్రోసోపాగ్నోసియా అంటే ఫేస్ బ్లైండ్నెస్. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వ్యాథి ఉన్నవారు తమ ముఖంతో పాటు ఎదుటివారి ముఖాలను గుర్తుపట్టలేరు. తరచూ చూస్తున్నా కూడా వాళ్లను గుర్తించలేరు. సరిగ్గా ఇదే సమస్యతో సతమతమవుతుంటాడు సూర్య (హీరో). మొదట్లో ఈ సమస్యను కామడీగానే చూపించిన మేకర్స్, ఆ తర్వాత సీరియస్‌గా చూపిస్తారు. ఓ హత్యను ప్రత్యక్షంగా చూసిన సూర్య హంతకులని పట్టుకునేందుకు పోలీసులకు సహాయపడాలనుకుంటాడు. కానీ అనుకోకుండా తను మూడు మర్డర్స్‌లో ఇరుక్కుంటాడు. అలాంటి వ్యాధితో బాధపడుతున్న సూర్య ఆ కేసుల నుంచి ఎలా బయటపడతాడు? దాని కోసం అతడు పడ్డ కష్టాలేంటి అన్నదే మిగతా స్టోరీ.