Shruti Haasan About Marriage :కోలీవుడ్ స్టార్ హీరో శ్రుతి హాసన్ తాజగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించారు. వివాహబంధంపై తనకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని శ్రుతి గతంలో చెప్పారు. అయితే తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
"లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని విధంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా! నేను రిలేషన్‌లో ఉండడానికి ఇష్టపడతాను. రొమాంటిక్‌గా ఉండటం నాకు ఇష్టం. నా చుట్టూ ఉండేవారితోనూ నేను చనువుగానే ఉంటాను. అయితే ప్రస్తుతానికి మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా సరే నా మనసుకు దగ్గరైతే వారిని తప్పకుండా వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇక నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు" అని పెళ్లి గురించి శ్రుతి క్లారిటీ ఇచ్చారు.
ఇదేం ఫస్ట్ టైమ్ కాదు!
అయితే శ్రుతి ఇలా రిలేషన్, పెళ్లి గురించి మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ ఆమెకు ఇటువంటి ఓ ప్రశ్నే వేశారు. 'మీరు సింగిలా లేకుంటే రిలేషన్‌లో ఉన్నారా?' అని అడగ్గా, దానికి శ్రుతి కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు. "నాకు ఇటువంటి ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను. ఇప్పుడైతే నేను సింగిలే. రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతానికి వర్క్‌లో మునిగిపోయాను. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా" అని తెలిపారు.