తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత సైలెంట్ బ్లాస్ట్ - సోషల్ మీడియా షేక్​! - Samantha Upcoming Movies - SAMANTHA UPCOMING MOVIES

Samantha Photoshoot and Upcoming Movies : సమంత మరోసారి నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఆమె సైలెంట్ బ్లాస్ట్​ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

సమంత సైలెంట్ బ్లాస్ట్ - ఈ ముద్దుగుమ్మ లైనప్​ ఇదే!
సమంత సైలెంట్ బ్లాస్ట్ - ఈ ముద్దుగుమ్మ లైనప్​ ఇదే!

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 2:18 PM IST

Samantha Photoshoot and Upcoming Movies :హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా క్వీన్​గా ఇమేజ్​ క్రియేట్ చేసుకున్న ఈ భామ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన స్టైల్‌ను మార్చుకుంటూ ఫ్యాషన్‌ లేడీగా పేరు తెచ్చుకుంటుంది. ఎక్కడికి వెళ్లిన తన గ్లామర్​తో మెరుపులు మెరిపిస్తుంది. ప్రస్తుతం అసలే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనూ సామ్ తన హాట్ గ్లామర్​తో మరింత హీట్ పెంచేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా ఫొటోషూట్లు పోస్ట్ చేస్త మంట పెడుతోంది.

తాజాగా ఓ మ్యాగ్జైన్​ కోసం మరో కొత్త ఫొటోషూట్​ను వదిలింది. ఇందులో ఈ ఉ ఉంటావా భామ బ్లాక్ కలర్ సూట్ వేసుకుని తన అల్ట్రా గ్లామర్​తో మెరిసింది. బ్లాక్ కలర్ బ్లేజర్​కు బటన్స్​ వేసుకోకుండా స్కీన్ షో చేసింది. దీంతో ఈ ఫొటోషూట్​ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వాటిని తెగ షేర్ చేస్తూ లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే సమంత సైలెంట్​గా తన లైనప్​ను బ్లాస్​ చేసేలా కనిపిస్తోంది. గత ఏడాది ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అప్పటి నుంచి తన మయోసైటిస్ ట్రీట్మెంట్​ కోసం ఏడాది పాటు బ్రేక్ తీసుకుని ఈ మధ్యే మళ్లీ బ్యాక్ టు వర్క్​ మోడ్​లోకి వచ్చింది. త్వరలోనే సిటాడెల్​తో సందడి చేయనుంది.

దీని తర్వాత ఇక యాక్టింగ్​పైనే మళ్లీ ఫుల్​ ఫోకస్ చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతోందట. అందులో అట్లీ - అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ చేయబోయే తన ఆఖరి సినిమా కోసం సమంతతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక నెట్ ఫ్లిక్స్, అమెజాన్​లతో కూడా వెబ్ సిరీస్​ల కోసం డిస్కషన్స్​ జరుగుతున్నాయట. ఇవి కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే రానున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే త్వరలోనే డైరెక్ట్ సినిమాతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇవ్వనుందట.

ఆ ఫోటో నిజం కాదు - విజయ్ దేవరకొండ - Family Star Negative Trolling

గంగమ్మ జాతర ఫైటింగ్ సీక్వెన్స్​​ - వామ్మో అన్ని కోట్లు ఖర్చు చేశారా? - Pushpa 2 Teaser

ABOUT THE AUTHOR

...view details