ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వామ్మో - సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్​ జీతం నెలకు అన్ని లక్షలా? - Salman Khans bodyguard Salary - SALMAN KHANS BODYGUARD SALARY

SALMAN KHANS BODYGUARD SALARY : ఫిల్మ్ హీరోలు కోట్లు సంపాదించడం కామనే. కానీ వాళ్ల దగ్గర బాడీగార్డుగా పనిచేసే వాళ్లు కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారని మీకు తెలుసా? తాాజాగా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్​కు సంబంధించిన సంపాదన వివరాలు తెలిశాయి. ఇది తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

source ETV Bharat
Salman Khans bodyguard Shera Salary (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 7:55 PM IST

SALMAN KHANS BODYGUARD SALARY : సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్ పరిశ్రమలోని ఓ పాపులర్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తున్నాడట.

అతనెవరో కాదండీ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్​ గుర్మీత్ సింగ్ జాలీ. గత మూడు దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్​గా వ్యవహరిస్తున్న ఇతన్ని షేరా అని ముద్దుగా పిలుచుకుంటారు ఇండస్ట్రీ ప్రజలు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా గురించి వివరంగా తెలుసుకుందాం.

ముంబయి నగరంలో 1969లో పుట్టిన షేరా జూనియర్ బాడీ బిల్డింగ్​లో ఛాంపియన్‌ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశారు. అలా పనిచేస్తున్న సమయంలో 1995లో సల్మాన్ ఖాన్‌కు పరిచమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్​ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్న సల్మాన్ అప్పటి నుంచి అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్​కు నమ్మకం, చనువు రెండూ ఎక్కువే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీరిద్దరి ఫొటోలే దీనికి నిదర్శనం. కొన్ని ఫొటొల్లో షేరా సల్మాన్ ఖాన్ భూజాలపై చేయి వేసి నిలబడటం మనం చూడచ్చు.

55 ఏళ్ల వయస్సులోనూ సల్మాన్​పై ఈగ వాలకుండా చూసుకునేందుకు సిద్ధంగా ఉంటాడు షేరా. సల్మాన్ ఖాన్ పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చే సమయంలో కవచంలా నిల్చొని తన బాధ్యతను నిర్వర్తిస్తుంటాడు. ఇప్పడే కాదు ఎప్పటికీ తాను బతికి ఉన్నంతవరకూ సల్లూ భాయ్‌తోనే ఉంటానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చాడు షేరా. అందుకే షేరా నమ్మకానికి, కమిట్మెంట్‌కు సల్లూ భాయ్ కూడా బాగానే చెల్లిస్తున్నాడని తెలిసింది.

ఎంతో మంది ఉన్నతాధికారులు, బాలీవుడ్ హీరోలు సంపాదించలేని డబ్బుని షేరాకు ఇస్తున్నారట. అలా షేరా నెలకు రూ.15లక్షల జీతం, ఏడాదికి రూ.2కోట్ల వరకూ అందుకుంటున్నారని ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది. షేరాకు కవాసాకి సూపర్ బైక్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయట.

నాకు ప్రాణ హాని ఉంది, కాపాడండి : పొలిమేర 2 నిర్మాత ఫిర్యాదు - Polimera 2 Producer

దేవర్​ నుంచి సూపర్ అప్డేట్​ - ఎన్టీఆర్​పై స్టార్​ కొరియోగ్రాఫర్​ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details