Salaar Streaming In Netflix Top 10 :ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్' అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా (నాన్ ఇంగ్లీష్)ల్లో సలార్ టాప్- 10లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. పాన్ఇండియా సినిమా కాస్త గ్లోబల్ మూవీగా మారిందంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఓటీటీలో విడుదలైన 5 రోజులకే ఈ ఘనతను సాధించడం విశేషం.
నాన్-ఇంగ్లిష్ కేటగిరీలో టాప్-10లో సలార్ స్ట్రీమింగ్
- టాప్-1లో- సలార్(తెలుగు)
- టాప్-2లో- సలార్(తమిళం)
- టాప్-5లో- సలార్(కన్నడ)
- టాప్-7లో- సలార్(మలయాళం)
త్వరలో ఇంగ్లిష్‌లోనూ?
గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో తెలుగు, హిందీ సహా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది 'సలార్'. కానీ, ఓటీటీలో మాత్రం సలార్-హిందీ వెర్షన్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇక ఇప్పుడు ఓటీటీ టాప్-10లో వివిధ లాంగ్వేజస్‌లో సలార్ స్ట్రీమ్ అవుతుండడం వల్ల హిందీలోనూ ఎప్పుడు రిలీజవుతుందోనని ఎదురుచూస్తున్నారు నార్త్ ఇండియన్స్. అలాగే 'సలార్' సినిమాను త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్లోనూ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.