Salaar Globalwide OTT Response:రెబల్‌స్టార్ ప్రభాస్ రీసెంట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ 'సలార్ పార్ట్- 1' ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ (వరల్డ్‌వైడ్)కు బాగా కనెక్ట్ అవుతోంది. థియేటర్లలో ఎంత సక్సెస్ సాధించిందో ఓటీటీలో సలార్ అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
ప్రస్తుతం ఇండియన్ సౌత్ లాంగ్వేజెస్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్లో క్రేజ్ దక్కుతోంది. ఫారినర్స్ ట్వీట్స్‌తో సోషల్ మీడియాలో మరోసారి సలార్ మేనియా క్రియేటైంది. సలార్ చూసిన ఫారిన్ ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ప్రసంశలు కురిపిస్తున్నారు. అయితే ఇండియన్ భాషల్లోనే ఇలా ఉంటే, ఇక ఇంగ్లీష్ వెర్షన్ అందుబాటులోకి వచ్చాక వరల్డ్‌వైడ్‌గా రెస్పాన్స్ పీక్స్‌లో ఉండే ఛాన్స్ ఉంది.
గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో తెలుగు, హిందీ సహా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 'సలార్' గ్రాండ్‌గా రిలీజైంది. మరోవైపు ఓటీటీలో టాప్- 10 సలార్ స్ట్రీమ్ అవుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇక ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది.