తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కాలేజీ ఫెస్ట్​లో 'షీలా కీ జవానీ' సాంగ్​కు సాయిపల్లవి డ్యాన్స్​ - స్టేజ్ షేకే! - Saipallavi Sheila Ki jawani Dance - SAIPALLAVI SHEILA KI JAWANI DANCE

Saipallavi Sheila Ki jawani Dance Video : సాయి పల్లవి షీలా కీ జవానీ అంటూ తన ఫ్రెండ్స్​తో కలిసి కాలేజ్​ డేస్​లో వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. మీరు చూశారా?

కాలేజీ ఫెస్ట్​లో 'షీలా కీ జవానీ' సాంగ్​కు సాయిపల్లవి డ్యాన్స్​ - స్టేజ్ షేకే!
కాలేజీ ఫెస్ట్​లో 'షీలా కీ జవానీ' సాంగ్​కు సాయిపల్లవి డ్యాన్స్​ - స్టేజ్ షేకే!

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 4:00 PM IST

Updated : Apr 16, 2024, 4:34 PM IST

Saipallavi Sheila Ki jawani Dance Video : సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం కాదు, అభినయమే ప్రధానం అనుకుంటుందామె. గ్లామర్‌ పాత్రల కన్నా నటనకే ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఓటు వేస్తుందామె. మేకప్‌ లేకుండానే పాత్రలకు ప్రాణం పోస్తుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈమెలో గొప్ప డ్యాన్సర్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ వేసిందంటే బాడీ మొత్తం మెలికలు తిరగాల్సిందే. అయితే తాజాగా ఈమె డ్యాన్స్ వేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాలేజీ డేస్​లో షీలా కీ జవానీ అంటూ ఈ ముద్దుగుమ్మ వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్​గా మారింది. ఇందులో ఆమె తన ఫ్రెండ్స్, గ్యాంగ్‌తో కలిసి చిందులేస్తూ అదరగొట్టేసింది. ఈ పాటకు ఆమె వేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోతున్నారు. ఇలా మెలికలు తిరుగుందేంట్రా బాబు, లేడీ మైకేల్ జాక్సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, గతంలో సాయి పల్లవి ఢీ కంటెస్టెంట్‌గానూ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ఫిదా సినిమాతో ఆడియెన్స్​ను ఫిదా చేసిందీ అమ్మడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, దియా, కణం, పడి పడి లేచే మనసు, మారి 2, అథిరన్, ఎన్​జీకే, పావ కదైగల్, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న హిందీ రామాయణంలో నటించేందుకు రెడీ అవుతోందని అంటున్నారు. రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి(Saipallavi Ramayan Movie) కనిపించనున్నారట. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ కూడా ఈమె తీసుకోనుందని అంటున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకుతోనూ(Sai Pallavi AAmir Khan Son Movie) ఓ మూవీ చేస్తోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటోంది.

తెలుగులో రీమేక్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ - హీరోగా టాలీవుడ్ డైరెక్టర్​! - Jaya Jaya Jaya Jaya Hey Movie

ప్రభాస్ రాజాసాబ్​ లేటెస్ట్ లీక్ - సెట్స్​లోకి అడుగుపెట్టిన ఆ హీరోయిన్​! - Prabhas Rajasaab

Last Updated : Apr 16, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details