Ram Charan Honorary Doctorate : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న జరగనున్న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేయున్నారు.
ఏప్రిల్ 13న జరిగే ఈ స్నాతకోత్నవం సినీ నిర్మాత, యూనివర్సిటీ ఛాన్సలర్ ఈసారి గణేశ్ అధ్యక్షతన జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరకానున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపు ఈ డాక్టరేట్‌ను ప్రకటించారు. దీనిని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందజేయనున్నారు.
Ram Charan Movie :ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 'ఆర్ఆర్ఆర్', ' ఆచార్య' తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారు.