తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బన్నీ ఫ్యాన్స్​ గెట్​రెడీ- 'పుష్ప 2' నుంచి మరో టీజర్- తర్వాత సాంగ్ కూడా! - Pushpa 2 Update - PUSHPA 2 UPDATE

Pushpa 2 Update: పుష్ప ది రూల్ సినిమా నుంచి మేకర్స్ ఇటీవల ఓ టీజర్ వదిలారు. ఈ టీజర్​కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. అయితే ఫ్యాన్స్​లో మరింత జోష్ నింపేందుకు మరో టీజర్ విడుదల చేసేందుకు మూవీటీమ్ ప్లాన్ చేస్తోందట.

Pushpa 2 Update
Pushpa 2 Update

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 7:17 AM IST

Updated : Apr 18, 2024, 7:31 AM IST

Pushpa 2 Update:ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారిపోతోంది. రీసెంట్​గా బన్నీ బర్త్​డే సందర్భంగా మేకర్స్​ వదిలిన టీజర్​కు భారీ రెస్పాన్స్​ వచ్చింది.

ఈ టీజర్ యూట్యూబ్​ను సైతం షేక్ చేసింది. టీజర్​లో బన్నీని అమ్మోరు గెటప్​లో చూసిన ఆయన ఫ్యాన్స్​ పూనకాలతో ఊగిపోయారు. టీజర్ చివర్లో ఫైట్ సీన్​తో ఎలివేషన్ ఇచ్చారు. అయితే టీజర్​లో అల్లు అర్జున్ నుంచి ఆయన ఫ్యాన్స్ కనీసం ఓ డైలాగ్​ ఎక్స్​పెక్ట్ చేశారు. కానీ, సుక్కు టీజర్​లో డైలాగ్స్ చేర్చలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు!

అయితే ఫ్యాన్స్​లో జోష్​ పెంచేందుకు మూవీటీమ్ మరో ప్లాన్ చేస్తోంది. సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యిందని టాక్. అందులో పలు డైలాగ్స్​తోపాటు, మరో యాక్షన్ సీన్​ ఉండేలా టీజర్​ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఓ పాటను సైతం విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే వరుస అప్డేట్​లతో అటు ఫ్యాన్స్​తోపాటు మూవీ లవర్స్​కూ పండగే.

ఇక సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్​గా నటిస్తోంది. రీసెంట్​గా రష్మిక పుట్టినరోజు ఆమె పోస్టర్ రిలీజైంది. ఇందులో ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బంగారు వేసుకుని గ్రాండ్​ లుక్​లో ధగధగ మెరిసిపోతూ కనిపించింది. దీంతో తొలి భాగంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉన్న రష్మిక సీక్వెల్​లో మాత్రం బాగా డబ్బున్న మహిళగా కనిపించనుందని అర్థమౌతోంది. ఇక ఈ సినిమాకు రాక్​స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్​పై నవీన్ యర్నేనీ, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానుంది.

గంగమ్మ జాతర ఫైటింగ్ సీక్వెన్స్​​ - వామ్మో అన్ని కోట్లు ఖర్చు చేశారా? - Pushpa 2 Teaser

శ్రీవల్లి చానా రిచ్ అయిపోయింది​ - పుష్ప 2 రష్మిక బర్త్​ డే ట్రీట్ పోస్టర్​ రిలీజ్ - Pushpa 2 Rashmika

Last Updated : Apr 18, 2024, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details