తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప రాజ్' రూల్ షురూ - ట్రైలర్ ఆగయా! - PUSHPA 2 TRAILER

ఎదురుచూపులకు తెర - పుష్ప 2 ట్రైలర్ రిలీజ్

Pushpa Trailer
Pushpa Trailer (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 6:06 PM IST

Pushpa 2 Trailer :ఇండియన్ సినిమా లవర్స్​ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'పుష్ప 2' ట్రైలర్ వచ్చేసింది.​ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మూవీమేకర్స్ బిహార్​ పట్నాలో ఆదివారం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. పట్నా గాంధీ మైదాన్​లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్​లో పుష్ప ది రూల్ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ఈవెంట్​కు హీరో అల్లు అర్జున్- రష్మిక మంధన్నాతో సహా మూవీటీమ్​ హాజరయ్యారు.

అలాగే దేశ నలుమూలల నుంచి వేలాది అభిమానులు ఈవెంట్​కు హాజరయ్యారు. 'పుష్ప రాజ్‌ తగ్గేదేలే' అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేలాది అభిమానులతో పట్నా గాంధీ మైదానం కిక్కిరిసిపోయింది. ఈ ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

పుష్ప రాజ్​ డబ్బంటే లెక్క లేని వ్యక్తిగా పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభించారు. సీక్వెల్​లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్​లో ఎదిగిపోయినట్లు చూపించారు. ప్రతి షాట్ ఊర మాస్​గా ఉంది. ఫుల్ పవర్ ప్యాక్డ్​ యాక్షన్ సీన్స్​తో సుకుమార్ సినిమాపై అంచనాలు మరో లెవెల్​కు తీసుకెళ్లారు. బన్నీ డైలాగ్స్, మేనరిజం మరోసారి ట్రెండ్ సెట్ చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెఖావత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్​గా ఉంది. 'పుష్ప అంటే ఫైర్ కాదు- వైల్డ్ ఫైర్' అనే కొత్త డైలాగ్​తో ఈసారి బన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. ఓవరాల్​గా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందనే చెప్పాలి.

కాగా, సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ఇండియా లెవెల్​లో డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్​లో డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసింది. ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన బజ్ క్రియేటైంది. దీంతో రిలీజ్ రోజే పుష్ప పలు రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'పుష్ప' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్- మాస్ లెెవెల్​లో బన్నీ ఎంట్రీ!

'పుష్ప 2'కి నేనే కాదు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు : తమన్

ABOUT THE AUTHOR

...view details