తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బుక్‌ మై షోలో 'పుష్ప 2' హవా - సౌత్​లో మరో నయా రికార్డు సొంతం! - PUSHPA 2 BOOKMYSHOW RECORD

బుక్‌ మై షోలో 'పుష్ప 2' హవా - ఇప్పటివరకూ ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే?

Pushpa 2 BookMyShow Record
Allu Arjun Pushpa 2 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 1:18 PM IST

Pushpa 2 BookMyShow Record : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మరికొద్ది గంటల్లో పుష్ప రాజ్​గా ప్రేక్షకులను పలకరించనున్నారు. పాన్ఇండియా లెవెల్​లో ఈ చిత్రం గురువారం (డిసెంబర్ 5)న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 4 అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్​ వైడ్​గా 12 వేలకుపైగా థియేటర్లలో, 80 దేశాల్లో, 6 భాషల్లో విడుదల కానుంది.

అయితే తాజాగా బుక్‌ మై షోలో టికెట్‌ బుకింగ్స్‌ విడుదల చేయగా క్షణాల్లోనే అవి అమ్ముడయ్యాయి. ఓవర్సీల్​లో ప్రీ బుకింగ్స్​ విషయంలో అనేక రికార్డులను సొంతం చేసుకున్న 'పుష్ప 2' ఇదే స్పీడ్​తో మరో ఘనతను సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ టికెట్స్‌ అమ్ముడైన సినిమాగా రికార్డుకెక్కింది.

ఇదే కాకుండా ఇటీవల హిందీ వెర్షన్‌ టికెట్స్‌ ఓపెన్‌ చేయగా అక్కడ కూడా ఇదే జోరును చూపించింది. కేవలం 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయట. అలా బీటౌన్​లో ఆల్‌టైమ్‌ టాప్ చిత్రాల లిస్ట్‌లో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా ఈ చిత్రంలో శ్రీ వల్లి అనే పాత్రలో మెరుస్తుండగా, మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్​లాల్ షెకావత్​గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్​లు స్ట్రాంగ్​ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చాట్​బస్టర్లుగా నిలిచి నెట్టింట ట్రెండ్​ అవుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేశారు. తాజాగా హైదరాబాద్​లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​ సక్సెస్​ఫుల్​గా సాగింది. దీనికి మూవీ టీమ్​తో పాటు రాజమౌళి, బన్నీ ఫ్యామిలీ, బుచ్చిబాబు సానా తదితరులు హాజరై సందడి చేశారు.

'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్ - ఫ్యాన్స్​ను ఉద్దేశించి బన్నీ ఏమన్నారంటే?

'పుష్ప 2' - రష్మికకు ఆ సెంటిమెంట్​ కలిసొస్తుందా?

ABOUT THE AUTHOR

...view details