Prabhas Best Friend In Tollywood : టాలీవుడ్‌కే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు ఏదైనా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు చిత్రసీమలో ఎంతో సింపుల్‌గా, సిగ్గుపడుతూ కనిపించే ఈయనకు దేశవ్యాప్తంగా భారీ రేంజ్లో పాపులారిటీ ఉంది. ఎటువంటి అంగు ఆరబాటం లేకుండా సింపుల్‌గా స్టేజ్‌పైకి వచ్చి, సిగ్గుపడుతూనే ఒకటి రెండు మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. అలానే భారీ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయారు.
ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో అందరికీ బాగా దగ్గరయ్యారు ప్రభాస్. ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వారిని బాగా చూసుకుంటారు. తన పిఏ దగ్గర నుంచి ఇంట్లో పని చేసే వారి వరకు, ఇంకా తన తోటి నటులకు అద్భుతమైన రుచికరమైన భోజనాన్ని పెడుతూ వారి మనసులను దోచుకున్నారు.
మరి అంతటి గొప్పవాడైన ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే చాలా మందికి టక్కున నటుడు గోపిచంద్ పేరే చెబుతారు. కానీ డార్లింగ్‌కు ఇండస్ట్రీలో మరో బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. హా అవును. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పుకొచ్చింది. ప్రభాస్‌కు ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా - ప్రభాస్ ఎప్పుడూ ఒక్కరంటూ అనీ ఏమీ చెప్పలేదు. ఆయనకు అందరూ అంటే చాలా ఇష్టం. ఇక చరణ్ అయితే మంచి ఫ్రెండ్. చాలా ఇష్టం. ఉపాసన కూడా ప్రభాస్‌కు మంచి ఫ్రెండ్ అంటూ డార్లింగ్ దోస్తీని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో చాలా కాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తిరుగుతోంది.
Prabhas Upcoming Movies : ఇకపోతే గతంలో బాహుబలి సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత చాలా కాలం సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలు భారీ డిజాస్టర్లను అందుకున్నాయి. అయినా ఆయన మార్కెట్ తగ్గలేదు. ఈ మధ్యే యాక్షన్ ఎంటర్టైనర్ సలార్‌తో వచ్చి బాక్సాఫీస్ ముందు ఊచకోత కోశారు. వందల కోట్ల వసూళ్లను అందుకుని సైలెంట్‌గా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు భారీ చిత్రాలు ఉన్నాయి. సలార్ 2, ప్రాజెక్ట్ కె కల్కి, రాజాసాబ్ ఈ ఏడాది విడుదల కానున్నాయి. వచ్చే ఏడాది స్పిరిట్‌తో పాటు హనురాఘవపూడి సినిమాలు సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ సినిమా ఉందని ప్రచారం సాగుతోంది.
షాకింగ్‌గా ఊర్వశి రౌతేలా బర్త్ డే వేడుకలు - ఏకంగా 24 క్యారెట్ గోల్డెన్ కేక్ కట్ చేసి! అల్లు అర్జున్ వారసుడు వచ్చేస్తున్నాడహో- ఆ సూపర్ హిట్ సీక్వెల్‌తో ఎంట్రీ!