తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్ X ప్రకాశ్ రాజ్ - 'OG'లో ఇద్దరి మధ్య ఫైట్​ సీన్?

Prakash Raj OG Movie : సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ 'ఓజీ' సినిమాలో నటిస్తున్నారని సమాచారం. హీరో పవన్ కల్యాణ్- ప్రకాశ్ రాజ్ మధ్య ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తోంది.

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Prakash Raj OG Movie
Prakash Raj OG Movie (Source: Etv Bharat)

Prakash Raj OG Movie :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ' (OG). ఈ సినిమాను డైరెక్టర్ సుజీత్ ముంబయి బ్యాక్ డ్రాప్​లో తెరకెక్కిస్తున్నారు. గతేడాది రిలీజైన గ్లింప్స్​కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

RFCలో షూటింగ్
పలు కారణాల వల్ల షూటింగ్​లకు బ్రేక్ ఇచ్చిన పవన్, రీసెంట్​గా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓజీ మూవీ షూటింగ్​ కూడా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్​లో పవన్ పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారని టాక్

ఇదే షెడ్యూల్​ షూటింగ్​లో ఆయన కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రకాశ్‌ రాజ్‌ - పవన్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అలాగే వీరిద్దరిపై ఓ ఫైట్ సీన్‌ సైతం షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే రీసెంట్​గా జరిగిన పరిణామాల వల్ల వీరిద్దరి మధ్య షూటింగ్ హాట్ టాపిగ్​గా మారింది. సెట్స్​లో వాతావరణం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్​ కూడా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు.

ఇక 'ఓజీ' సినిమా విషయానికొస్తే, ముంబయి బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌ స్టర్​గా కనిపించనున్నారు. పవన్ సరసన నటి ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ హీరో ఇమ్రాన్‌ హష్మి విలన్ రోల్​లో కనిపించనున్నారు. వీరితో పాటు అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం పవన్‌ సినిమాల విషయానికొస్తే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్​పై బాలీవుడ్ స్టార్ యాక్టర్​ ప్రశంసలు - ఏం అన్నారంటే?

'OG స్టోరీ బాబాయ్ కంటే ముందు నేనే విన్నా - ఇది మీ ఊహకు అందదు' - Varun Tej on OG Movie

ABOUT THE AUTHOR

...view details