NTR Prashanth Neel:గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమా 'ఎన్టీఆర్ 31' వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనుంది. అయితే ఇప్పటికే సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తోంది.
ఇక లేటెస్ట్గా సినిమా షూటింగ్ గురించి మరో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ 2024 ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ తొలి వారంలో పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. అప్పటిలోగా ఎన్టీఆర్ వార్- 2లో తన షూటింగ్ సీన్స్ కంప్లీట్ చేసుకుంటారట. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్- 2 కూడా దాదాపు పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమా కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారంట. దీంతో తారక్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ వచ్చింది.
కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నుంచి రానున్న ఈ ప్రాజెక్ట్‌పై మూవీ లవర్స్‌లో ఇప్పటికే ఎక్ట్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా ఎన్టీఆర్ లుక్ మాస్‌గా ఉంది. పూర్తిగా బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పోస్టర్లో ఎన్టీఆర్ కళ్లు వేటకు సిద్ధమైన పులిలా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందనుంది.