NTR Devara Movie Trailer :అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఈ నెల 27న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మొదట గ్లింప్స్‌లో 'ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది. అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు' అంటూ ఎన్టీఆర్ చెప్పారు. ఇప్పుడా నెత్తురి వేట, ఎన్టీఆర్ కత్తి వేటు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు కొరటాల శివ.
"కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో, మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, మా దేవర కథ" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీఆర్‌కు యాక్షన్ ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్‌ను ప్రారంభించారు.