Nikhil Swayambhu :టాలీవుడ్లో విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ సరికొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు నిఖిల్. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత ఆయన మార్కెట్ కూడా పెరిగింది. అప్పటివరకు తన మార్కెట్ స్థాయి బడ్జెట్ మూవీస్‌తో ప్రేక్షకులను పలకరించిన నిఖిల్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ కూడా అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.
అయితే తాజాగా నిఖిల్ తన సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి స్పెషల్ బిగ్ స్క్రీన్ ట్రీట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సర్ప్రైజ్స్ ఉన్నాయని ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నీషియన్స్, ఫిల్మ్ మేకర్ దీని కోసం పనిచేయబోతున్నారని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఈ పోస్ట్‌తో పాటు మూవీ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సిక్వెన్స్కు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్.
ఇది నిఖిల్‌కు 20వ చిత్రం. గత ఏడాది ఆగస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఇందులో నటిస్తున్న నటీనటుల అందరి ఫస్ట్ లుక్ పోస్టర్లను మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఈ మూవీపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తోంది.
Swayambhu Cast and Crew : ఇక ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా సంయుక్త మేనన్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు