తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నో అప్​డేట్స్​​ - రిలీజ్‌కు రెడీగా ఉన్న నిఖిల్‌ మూవీ!- ఏదంటే? - Nikhil New Movie - NIKHIL NEW MOVIE

Nikhil New Movie : వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరో నిఖిల్ తాజాగా ఓ కొత్త సినిమా రిలీజ్​ డేట్​ను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ చిత్రం ఏదంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 12:33 PM IST

Nikhil New Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ ప్రస్తుతం 'స్వయంభు' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో పాటు రామ్​ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది ఇండియన్ హౌస్​' చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే ఈ గ్యాప్​లోనే ఆయన మరో సూపర్ ప్రాజెక్ట్​తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ సుధీర్‌ వర్మ తెరకెక్కించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంతో ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌, దివ్యాంశ ఫీమేల్ లీడ్స్​గా మెరవనున్నారు.

తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్​ను షేర్ చేసింది. అయితే ఎక్కడా కూడా ఈ సినిమా గురించి ఒక్క వార్త కూడా రివీల్​ కాకుండానే డైరెక్ట్‌గా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ చిత్రాన్ని ఎప్పుడు అనౌన్స్‌ చేశారు? ఎప్పుడు షూట్‌ చేశారు? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూట్‌ జరిగిందంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

'కార్తికేయ 3' లోడింగ్- న్యూ అడ్వేంచర్ అంటూ నిఖిల్ హింట్
ఇక నిఖిల్ సిద్ధార్థ్​ లీడ్​లో తెరకెక్కిన 'కార్తికేయ', 'కార్తీకేయ- 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. దీంతో దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ పార్ట్- 3కి రంగం సిద్ధమ చేస్తున్నారు. రెండో పార్ట్​కు తెలుగు కంటే, హిందీలో భారీగా రెస్పాన్స్ లభించింది. అక్కడ కలెక్షన్లు కూడా భారీగానే రావడం వల్ల మూడో పార్ట్‌ను కూడా దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అలా కార్తికేయ- 3తో నిఖిల్- చందూ మొండేటి మరోసారి తెలుగు ప్రేక్షకులతోపాటు దేశవ్యాప్తంగా అలరించనున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌ను స్వయంగా నిఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ రిలీజైన కార్తికేయ రెండు పార్ట్‌లలోనూ కథ దేవుడిపై నమ్మకం గురించే నడుస్తుంది. హీరో సైంటిఫికల్‌గా వాస్తవాలను ఒకొక్కటి బయటకు తీస్తుంటే, కథలో జరిగే పరిణామాలు ఆధ్యాత్మిక అంశాలకు లోబడి జరుగుతుంటాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మూడో దశలో ఉంది. గత రెండు సినిమాల కంటే కార్తికేయ- 3 ఇంకా గ్రాండ్‌గా ఉండబోతుందని దర్శకుడు చందూ చెప్తున్నారు. సినిమాలో ఇతర తారాగణం గురించి త్వరలోనే వెల్లడించే ఛాన్స్​ ఉంది.
నిఖిల్, చెర్రీ ప్రాజెక్ట్​ స్టార్ట్​ - 'ది ఇండియా హౌస్‌' షూటింగ్ ఎప్పుడంటే?

వంద కోట్ల క్లబ్​లో తెలుగు యంగ్ హీరోలు- నిఖిల్, సిద్ధు, తేజ లిస్ట్​లో ఇంకా ఎవరంటే - 100 Crore Tollywood Heros

ABOUT THE AUTHOR

...view details